108 ఎంపీ కెమెరాతో Infinix GT 30 Pro 5G..!
ప్రస్తుతం భారత మార్కెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తమ కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. 'Infinix GT 30 Pro 5G' పేరిట ఓ హైఎండ్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇది గతంలో విడుదలైన GT 20 Proకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తుండగా.. టెక్ ప్రియులను, గేమింగ్ లవర్స్‌ను ఆకట్టుకునేలా అధునాతన ఫీచర్లతో రాబోతోంది.
లీకైన స్పెసిఫికేషన్‌ల ప్రకారం ఫోన్ ఫీచర్లు ఇవే..
డిస్ ప్లే..
6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే
144Hz రిఫ్రెష్ రేట్
2,160Hz టచ్ శాంప్లింగ్ రేట్
2,304Hz PWM డిమ్మింగ్
1,100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
గోరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్

ప్రాసెసర్ & OS..
4nm ఆక్టాకోర్ MediaTek Dimensity 8350 Ultimate SoC
Android 15 ఆధారిత XOS 15
RAM & స్టోరేజ్..
12GB LPDDR5X RAM (వర్చువల్‌గా మరో 12GB వరకు విస్తరించవచ్చు)
256GB / 512GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు
కెమెరా..
108MP ప్రైమరీ కెమెరా, మిగతా వివరాలు ఇంకా వెల్లడికాలేదు
బ్యాటరీ & ఛార్జింగ్..
5,500mAh బ్యాటరీ ఉంది. ఇది 45W వైర్డ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 10W వైర్డ్, 5W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది.
గేమింగ్ ఫీచర్లు..
మాగ్‌ఛార్జ్ కూలర్‌తో ప్రత్యేకమైన గేమింగ్ ఎడిషన్ గా వస్తుంది. XBoost గేమింగ్ ఇంజిన్, AI ఆధారిత VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, షోల్డర్ ట్రిగ్గర్స్ (గేమింగ్ ఎక్సపీరియన్స్ మెరుగ్గా ఉండేందుకు)
ధర..
12GB + 256GB వేరియంట్ ధర: సుమారు ₹26,000
12GB + 512GB వేరియంట్ ధర: సుమారు ₹30,000
కలర్స్..
బ్లేడ్ వైట్
డార్క్ ఫ్లేర్
షాడో యాష్
రంగుల్లో అందుబాటులోకి రానుంది
ఇక కనెక్టివిటీ కోసం ఇందులో 5జీ, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. అలాగే.. ఈ స్మార్ట్ ఫోన్ 7.9 ఎంఎం మందంతో 190 గ్రాముల బరువు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ లాంఛ్ వివరాలు..
ఇన్ఫినిక్స్ ఇప్పటివరకు భారత మార్కెట్లో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. అయితే గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ ఇప్పటికే లాంచ్ కావడం, లీకైన ఫీచర్లను చూస్తే భారత మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ ప్రధానంగా గేమింగ్ ప్రియులను టార్గెట్ చేస్తుండడం బాగా కలిసొచ్చే అంశం. అధిక ర్యామ్-స్టోరేజ్, పవర్‌ఫుల్ ప్రాసెసర్, స్పెషల్ కూలింగ్ ఫీచర్.. ఈ ఫోన్ ను ఒక గేమింగ్ మాస్టర్ లాగా మారుస్తున్నాయని సంస్థ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications