అదిరిపోయే గేమింగ్ ఫీచర్లతో Infinix GT 30 Pro..

కస్టమర్లను పెంచుకోవడానికి ప్రముఖ కంపెనీలు కూడా తక్కువ బడ్జెట్ లో సైతం అదిరిపోయే ఫీచరను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే టెక్ ప్రపంచాన్ని ఆకట్టుకునేందుకు Infinix తాజాగా GT 30 Pro మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మిడిల్-రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లతో ఉన్న ఈ గేమింగ్ ఫోన్ పై మార్కెట్లో మంచి బాజ్ ఏర్పడింది. ఇండియాలో ఈస్పోర్ట్స్‌కు యువత నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా, ఇన్ఫినిక్స్ ఇప్పుడు గతంలో విజయవంతమైన GT 20 Pro కు అప్‌గ్రేడ్ వెర్షన్ గా ఈ ఫోన్ ని లాంఛ్ చేసింది.

Infinix GT 30 Pro ఫీచర్లు..

వేరియంట్లు..

8GB RAM + 256GB స్టోరేజ్ - రూ.24,999

12GB RAM + 256GB స్టోరేజ్ - రూ.26,999

infinix-gt-30-pro-specifications-and-price-details

డిజైన్..

Infinix GT 30 Pro ఒక సైబర్-మెకా 2.0 గేమింగ్ ఇన్‌స్పైర్డ్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది.

7.99mm సన్నని ఆకృతి

188 గ్రాముల తక్కువ బరువు

RGB LED స్ట్రిప్ లైటింగ్ (డార్క్ ఫ్లేర్ వేరియంట్‌లో)

IR బ్లాస్టర్, షోల్డర్ ట్రిగ్గర్స్ లాంటి అదనపు గేమింగ్ ఫీచర్లు

గేమింగ్ లుక్ మరియు డే-టు-డే లుక్ రెండింటికీ తగ్గట్టుగా ఉంటుంది.

డిస్‌ ప్లే..

6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే

144Hz రిఫ్రెష్ రేట్ (BGMI లాంటి కొన్ని గేమ్స్ మాత్రం 120Hz వరకు సపోర్ట్ చేస్తాయి)

1224×2720 పిక్సెల్ రిజల్యూషన్, 100% DCI-P3 కలర్ గ్యామట్

1600 nits HBM బ్రైట్‌నెస్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్

సౌండ్..

డ్యూయల్ స్టీరియో స్పీకర్లు

DTS మరియు హై-రెజోల్యూషన్ ఆడియో సపోర్ట్

ఇయర్‌ఫోన్స్ అవసరం లేకుండా మల్టీమీడియా వినోదం ఆస్వాదించవచ్చు.

MediaTek Dimensity 8350 Ultimate చిప్‌సెట్ (4nm)

Mali-G615 MC6 GPU

LPDDR5X RAM - 8GB/12GB వేరియంట్లు

UFS 4.0 స్టోరేజ్ - 256GB

AnTuTu స్కోర్ - 11,84,530, Geekbench స్కోర్ - 1211 (సింగిల్ కోర్), 4181 (మల్టీ కోర్)

గేమింగ్ అనుభవం..

BGMI లో Smooth + Ultra Extreme సెట్టింగ్స్ లో 116 FPS సగటుగా, 120 FPS వరకు రిజిస్టర్ అయ్యింది

షోల్డర్ ట్రిగ్గర్స్ వల్ల శక్తివంతమైన గేమ్ కంట్రోల్ అనుభవం

బ్యాటరీ..

5500mAh బ్యాటరీ

45W ఫాస్ట్ ఛార్జింగ్

0% నుండి 50% - 30 నిమిషాల్లో

0% నుండి 100% - 55 నిమిషాల్లో

గేమింగ్‌లో సుమారు 5 గంటల 20 నిమిషాల బ్యాటరీ లైఫ్

కెమెరా..

108MP ప్రైమరీ సెన్సార్

8MP అల్ట్రా వైడ్ లెన్స్

13MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా

సాఫ్ట్‌వేర్ & ఇతర ఫీచర్లు..

XOS 15 UI - Android 15 ఆధారంగా

Dynamic Bar - నోటిఫికేషన్లను చిన్న యానిమేటెడ్ బార్‌ లాగా చూపిస్తుంది

In-Display Fingerprint Sensor - 90% సకాలంలో వేగంగా పనిచేస్తుంది

చిప్‌సెట్, స్మూత్ డిస్‌ప్లే, స్టైలిష్ డిజైన్, బలమైన ఆడియో, వేగవంతమైన ఛార్జింగ్ లాంటి లక్షణాలతో గేమింగ్ అభిమానుల కోసం ఈ ఫోన్ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. గేమింగ్, డే-టు-డే యూజ్ రెండింటికీ ఇది హ్యాండీ ఛాయిస్ గా పరిగణిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+