మిడ్ రేంజ్ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్స్‌తో iQOO Z10R..!

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ iQOO కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు నూతన సిరీస్ లతో మార్కెట్ ను పెంచుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా తమ కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z10R ను జూలై 24, 2025 న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో వస్తూ తక్కువ ధర లోనే అందించేందుకు ఈ ఫోన్ వస్తుండటంతో, మిడ్-బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

iqoo-z10r-price-and-specifications-details

iQOO Z10R ఫీచర్లు..

ధర..

రూ. 15,000 - రూ.20,000 మధ్య ఉండొచ్చు.

రంగులు..

ఆక్వామెరైన్ (Aquamarine)

మూన్‌స్టోన్ (Moonstone)

డిస్‌ప్లే..

సైజు: 6.77 అంగుళాల FHD+

టెక్నాలజీ: క్వాడ్ కర్వ్డ్ OLED (అత్యంత సన్నని బేజెల్స్‌తో)

రిఫ్రెష్ రేట్: 120Hz - స్క్రోలింగ్, గేమింగ్, వీడియోల కోసం చక్కటి అనుభవం

బ్రైట్‌నెస్: హై డైనమిక్ రేంజ్ స్పోర్ట్‌తో ఆకట్టుకునే డిస్‌ప్లే క్వాలిటీ

వాటర్‌-డస్ట్ ప్రొటెక్షన్..

రేటింగ్: IP68 / IP69

ప్రొటెక్షన్: మిలిటరీ-గ్రేడ్ షాక్ రేసిస్టెన్స్ - పటిష్టతకు పెద్ద పీట

బ్యాటరీ..

కెపాసిటీ: 5,700mAh

ఫాస్ట్ చార్జింగ్: (లీక్ ప్రకారం) 80W వరకు ఉండే అవకాశం

బ్యాటరీ లైఫ్: 1.5 నుంచి 2 రోజులు నార్మల్ యూజ్ లో

ప్రాసెసర్..

చిప్‌సెట్: MediaTek Dimensity 7400

ఆర్కిటెక్చర్: 4nm - ఎనర్జీ ఎఫిషియన్సీతో పెర్ఫార్మెన్స్ బలంగా ఉంటుంది

GPU: మల్టీ-లేయర్డ్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ - గేమింగ్, వీడియో ఎడిటింగ్‌కు అనుకూలం

మెమరీ & స్టోరేజ్..

RAM: 24GB వరకు (వర్చువల్ RAM కలిపి)

ఇంటర్నల్ స్టోరేజ్: 256GB

స్టోరేజ్ టైప్: UFS 3.1 - వేగంగా డేటా యాక్సెస్ కోసం

కెమెరా..

ప్రైమరీ సెన్సార్: 50MP Sony IMX882

ఫీచర్: OIS (Optical Image Stabilization)

నైట్ మోడ్: మల్టీ-ఫ్రేమ్ ప్రాసెసింగ్‌తో స్పష్టమైన నైట్ షాట్స్

ఫ్రంట్ కెమెరా..

రిజల్యూషన్: 32MP

ఫీచర్: 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్

కనెక్టివిటీ..

5G సపోర్ట్: హై స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్‌కు

WiFi 6, Bluetooth 5.3 - లేటెస్ట్ కనెక్టివిటీ టెక్‌తో

iQOO Z10R ఫోన్‌ ఖచ్చితంగా ఫీచర్-లవర్స్, గేమర్లు, వ్లాగర్లు, మిడ్-రేంజ్ బడ్జెట్ హంటర్లకు బెస్ట్ డీల్ అవుతుందని భావిస్తున్నారు. Amazon India, iQOO అధికారిక వెబ్‌సైట్ లలో నుంచి కొనుగోలు చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+