కళ్లు చెదిరే ఫీచర్స్‌తో iQOO కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్.. ఎంతంటే ??
ఐక్యూ (iQOO) కంపెనీ చైనా మార్కెట్లో తమ తాజా ఫ్లాగ్‌షిప్-లెవల్ స్మార్ట్‌ఫోన్ iQOO Z11 Turboను అధికారికంగా విడుదల చేసింది. భారీ బ్యాటరీ, అగ్రశ్రేణి ప్రాసెసర్, గేమింగ్‌కు ప్రత్యేకంగా రూపొందించిన ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పవర్ యూజర్లు, మొబైల్ గేమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని iQOO ఈ మోడల్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
భారీ బ్యాటరీ, అగ్రశ్రేణి ప్రాసెసర్, 200MP కెమెరా, గేమింగ్‌కు అనుకూలమైన ఫీచర్లతో iQOO Z11 Turbo చైనా మార్కెట్లో హైఎండ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో గట్టి పోటీని ఇవ్వనుంది. భారత్‌లో ఈ ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుందన్న దానిపై ఇంకా అధికారిక సమాచారం లేకపోయినా, విడుదలైతే ఫ్లాగ్‌షిప్ కిల్లర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫోన్ పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

iQOO Z11 Turbo ఫీచర్స్..
డిస్‌ప్లే & డిజైన్..
iQOO Z11 Turboలో 6.59 అంగుళాల 1.5K LTPS ఫ్లాట్ OLED డిస్‌ప్లే అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ను సపోర్ట్ చేస్తుంది. దీంతో నేరుగా ఎండలోనూ కంటెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. అల్ట్రా స్లిమ్ బెజెల్స్‌తో, 8.1 మిల్లీమీటర్ల మందంతో ఈ ఫోన్ ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. బరువు సుమారు 206 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం.
ప్రాసెసర్ & పనితీరు..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో తాజా Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ను ఉపయోగించారు. దీనితో పాటు ప్రత్యేకంగా గేమింగ్ పనితీరు కోసం ఒక డెడికేటెడ్ గేమింగ్ చిప్ను కూడా అందించారు.
ఫోన్‌లో
LPDDR5X Ultra RAM (16GB వరకు)
UFS 4.1 స్టోరేజ్ (1TB వరకు)
ఉండటంతో హెవీ మల్టీటాస్కింగ్, హైఎండ్ గేమ్స్ కూడా ఎలాంటి ల్యాగ్ లేకుండా నడుస్తాయి.
కెమెరా..
ఫోటోగ్రఫీ విషయంలో కూడా iQOO Z11 Turbo గట్టి ప్యాకేజ్‌ను అందిస్తోంది.
వెనుక భాగంలో OIS సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా
8MP అల్ట్రా వైడ్ సెన్సార్
ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా
ఉండటంతో హై-రిజల్యూషన్ ఫోటోలు, 4K వీడియో రికార్డింగ్, నైట్ ఫోటోగ్రఫీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
బ్యాటరీ & ఛార్జింగ్..
ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణ 7,600mAh భారీ బ్యాటరీ. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు సులభంగా నడిచేలా చేస్తుంది. అంతేకాదు, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ స్లిమ్‌గా ఉండటం ప్రత్యేకత.
సాఫ్ట్‌వేర్ & ఇతర ఫీచర్లు..
Android 16 ఆధారిత OriginOS 6
IP68 / IP69 రేటింగ్ (నీరు, ధూళి నిరోధకత)
ఇన్-డిస్‌ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
స్టీరియో స్పీకర్లు, హై-రెజ్ ఆడియో సపోర్ట్
ఈ ఫీచర్లు ఫోన్‌ను మరింత ప్రీమియంగా మారుస్తాయి.
ధరలు..
iQOO Z11 Turbo వివిధ వేరియంట్లలో లభిస్తోంది:
12GB RAM + 256GB స్టోరేజ్ - CNY 2,699 (సుమారు ₹34,999)
16GB RAM + 256GB స్టోరేజ్ - CNY 2,999 (సుమారు ₹38,900)
12GB RAM + 512GB స్టోరేజ్ - CNY 3,199 (సుమారు ₹40,200)
16GB RAM + 512GB స్టోరేజ్ - CNY 3,499 (సుమారు ₹44,900)
16GB RAM + 1TB స్టోరేజ్ - CNY 3,999 (సుమారు ₹51,900)
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications