ఊపిరి బిగబట్టిన భారతావని: అంతరిక్షంలో ఏం జరగబోతోంది..!!

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో మరో చారిత్రక ఘట్టానికి ఓ అడుగు దూరంలో నిలిచింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (SpaDeX) మిషన్ తుది అంకానికి చేరుకుంది. ఇస్రో చరిత్రలో ఓ సరికొత్త చరిత్రను సృష్టించడానికి పూర్తి సన్నద్ధమైంది.

స్పేస్ డాకింగ్‌లో భాగమైన రెండు ఉపగ్రహాలు ఇప్పుడు ఒకే కక్ష్యలో చేరాయి. ఎదురెదురు నిలిచాయి. ఈ రెండింటి మధ్య దూరం 15 మీటర్లు అంటే దాదాపుగా ఓ 50 అడుగుల వరకు ఉంటుంది. ఈ రెండు శాటిలైట్లు కూడా డాకింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా సరసన నిలుస్తుంది భారత్.

ISRO has announced SpaDeX satellites holding position at 15 meters apart in orbit

స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్‌ను కిందటి నెల 30వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా 220 కేజీల బరువున్న రెండు చిన్న ఉపగ్రహాలను తిరుపతి జిల్లా శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. దీనికోసం ప్రతిష్ఠాత్మక పీఎస్ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ఉపయోగించింది.

ఉపరితలం నుంచి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూకక్ష్యలో ఈ రెండు శాటిలైట్లు ప్రవేశించాయి. ఈ నెల 10వ తేదీన ఎస్‌డీఎక్స్ 01 ఛేజర్ శాటిలైట్.. ఎస్‌డీఎక్స్ 02 టార్గెట్‌ను సమీపించింది. మొదట్లో ఈ రెండు శాటిలైట్ల మధ్య దూరం 230 మీటర్లు. ఇప్పుడు మరింత చేరువ అయ్యాయి ఈ రెండూ.

ఇప్పుడు ఈ రెండింటి మధ్య దూరం 15 మీటర్లు మాత్రమే. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ఇస్రో వెల్లడించింది. ఎస్‌డీఎక్స్ 01 ఛేజర్ శాటిలైట్.. ఎస్‌డీఎక్స్ 02 టార్గెట్‌కు అతి సమీపానికి చేరిందని తెలిపింది. నిజానికి- ఈ నెల 7వ తేదీన స్పేస్ డాకింగ్‌ను షెడ్యూల్ చేసింది ఇస్రో. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా 9వ తేదీకి వాయిదా వేసింది.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ధీటుగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని ఇస్రో సంకల్పించిన నేపథ్యంలో ఈ స్పేస్ డాకింగ్ విజయవంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్‌లో చేపట్టబోయే అనేక స్పేస్ మిషన్‌లల్లో విప్లవాత్మక మార్పులకు ఇది శ్రీకారం చుట్టినట్టవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+