రూ.6,399లకే Itel A90 స్మార్ట్ ఫోన్.. లిమిటెడ్ ఎడిషన్ లాంఛ్ !
ఐటెల్.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది ఈ కంపెనీ. తక్కువ సమయంలోనే భారత మార్కెట్‌లో టాప్ బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. లేటెస్ట్ గా తాజాగా A90 Limited Edition ఫోన్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది.
స్టైలిష్ డిజైన్, AI ఫీచర్స్, భారీ డిస్‌ప్లే, IP54 రేటింగ్ వంటి ఫీచర్లతో పాటు మిలిటరీ-గ్రేడ్ బలం కలిగిన ఈ ఫోన్ ప్రస్తుతం టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్, ధరలు గురించి మీకోసం ప్రత్యేకంగా..

Itel A90 ఫీచర్స్..
ధరలు & వేరియంట్లు..
ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది:
3GB + 64GB వేరియంట్ - రూ.6,399
4GB + 64GB వేరియంట్ - రూ.6,899
కలర్స్..
ఈ ఫోన్ అరోరా బ్లూ, స్పేస్ టైటానియం, స్టార్‌లిట్ బ్లాక్ కలర్‌లలో లభిస్తుంది. ప్రస్తుతం ఇది కేవలం ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంది.
డిజైన్..
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్
Itel A90 Limited Editionకి MIL-STD-810H సర్టిఫికేషన్ మరియు IP54 రేటింగ్ లభించాయి.
అంటే ఇది నీటి చుక్కలు, ధూళి, సాధారణ పడిపోవడాన్ని తట్టుకోగలదు.
రూ.7,000 లోపు రేంజ్‌లో ఇలాంటి మిలిటరీ-గ్రేడ్ బలం ఇవ్వడం ఈ ఫోన్ ప్రత్యేకత.
డిస్ ప్లే..
6.6 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్ - స్క్రోలింగ్, గేమింగ్ మరింత సాఫీగా ఉంటుంది.
డైనమిక్ బార్ ఫీచర్ - నోటిఫికేషన్లు, బ్యాటరీ స్టేటస్‌ను సులభంగా చూడవచ్చు.
పవర్‌ఫుల్ పనితీరు..
Unisoc T7100 ప్రాసెసర్
స్టోరేజ్..
3GB/4GB RAM (వర్చువల్ RAM సపోర్ట్‌తో 8GB వరకు విస్తరణ)
64GB స్టోరేజ్ (microSD కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు)
Android 14 Go Edition ఆధారంగా Itel OS 14
రోజువారీ యాప్‌లు, సోషల్ మీడియా, లైట్ గేమింగ్ సులభంగా నిర్వహించగలదు.
స్మార్ట్ AI అసిస్టెంట్..
ఇందులో ప్రత్యేకంగా Aivana 2.0 AI అసిస్టెంట్ అందుబాటులో ఉంది.
డాక్యుమెంట్లను అనువదించడం
గ్యాలరీలోని ఫోటోలను గుర్తించడం
వాట్సాప్ కాల్స్ చేయడం
గణిత సమస్యలను పరిష్కరించడం లాంటివి చేయవచ్చు. బడ్జెట్ ఫోన్‌లో ఇలాంటి AI ఫీచర్లు ఉండటం ప్రత్యేక ఆకర్షణ.
కెమెరా..
13MP రియర్ కెమెరా - క్లియర్ ఫోటోలు, తక్కువ లైటింగ్‌లో కూడా మంచి ఫలితాలు.
8MP ఫ్రంట్ కెమెరా - సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు సరిపోతుంది.
స్లైడింగ్ జూమ్ బటన్ - ఫోటోలు తీసేటప్పుడు జూమ్ చేయడం సులభం.
బ్యాటరీ & ఛార్జింగ్..
5,000mAh బ్యాటరీ
15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
కనెక్టివిటీ & సెక్యూరిటీ..
డ్యూయల్ సిమ్ సపోర్ట్
DTS ఆడియో టెక్నాలజీ - మెరుగైన శబ్ద అనుభవం
బ్లూటూత్, Wi-Fi, USB-C పోర్ట్
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
గ్రిడ్ డిజైన్ ప్రీమియం ఫీల్‌ను ఇస్తుంది.












Click it and Unblock the Notifications