భారీ షాక్ ఇచ్చిన జియో హాట్‌స్టార్: ప్లాన్ రేట్లు డబుల్: ఒక్కసారి ఇనాక్టివేట్ అయితే గోవింద
వీక్షకులకు జియో హాట్‌స్టార్ షాక్ ఇచ్చింది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను భారీగా పెంచింది. కొత్త రేట్లు ఈ నెల 28వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కొత్తగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోదలిచిన వారికి ఈ ధరలు వర్తిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్ ధరలతో పోల్చుకుంటే ప్లాన్ ధరలు భారీగానే పెరిగాయి. ఇకపై ప్రీమియం వార్షిక ప్లాన్ ధర 2,199 రూపాయలకు చేరుతుంది. ప్రస్తుతం దీని ధర రూ.1,499 రూపాయలే.
నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల రేట్లను కూడా సవరించిందా సంస్థ. మొబైల్ సిరీస్ యాప్ ప్లాన్ ఇకపై నెలకు రూ. 79, మూడు నెలలకు రూ. 149, సంవత్సరానికి రూ. 499 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ఒక్క డివైజ్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పైగా యాడ్స్ కూడా వస్తాయి.

'సూపర్' సిరీస్ ప్లాన్ రేట్లను తీసుకోవాలనుకునే వారు ఈ నెల 28వ తేదీ నుంచి నెలకు రూ. 149, మూడు నెలలకు రూ. 349, సంవత్సరానికి రూ. 1,099 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రెండు డివైజ్ లకు వర్తిస్తుంది. ఇందులో కూడా అడ్వర్టయిజ్మెంట్స్ ఉంటాయి.
'ప్రీమియం' సిరీస్ ప్లాన్ ధర నెలకు రూ. 299, మూడు నెలలకు రూ. 699, సంవత్సరానికి రూ. 2,199గా నిర్ధారించారు. ఈ టాప్ ప్లాన్. నాలుగు డివైజ్ లను కనెక్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా. యాడ్స్ ఫ్రీ ప్లాన్ ఇది. స్పోర్ట్స్ సహా ఇతర లైవ్ ప్రోగ్రామ్స్ మినహా మిగిలిన అన్నింటినీ యాడ్స్ ఫ్రీగా వీక్షించవచ్చు.
సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లల్లో చోటు చేసుకున్న తాజా మార్పులు డిజిటల్ వ్యూవర్స్ కు మరింత అనుకూలంగా ఉంటాయని జియో హాట్ స్టార్ యాజమాన్య తెలిపింది. వారి అభిరుచులు, మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ప్లాన్లను రూపొందించామని వివరించింది. గత ఏడాది కనెక్టెడ్ టీవీ యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని జియోహాట్‌స్టార్ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన 11 నెలల్లో బిగ్ స్క్రీన్‌లపై వీక్షణ గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది.
పాత సబ్‌స్క్రిబర్లకు ఈ రేట్లు వర్తించబోవని, ఆటో రెన్యూవల్ సెట్టింగ్స్ యాక్టివ్ గా ఉన్నంత వరకు ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లు, ధరలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ నెల 28వ తేదీ నుండి కొత్తగా రిజిస్టర్ చేసుకునే సబ్‌స్క్రిబర్లకు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. కొత్త విధానంలో 'సూపర్', 'ప్రీమియం' సిరీస్ వారికి హాలీవుడ్ కంటెంట్ డిఫాల్ట్‌గా అందుతుంది. మొబైల్ సబ్‌స్క్రిబర్లు మాత్రం యాడ్ ఆన్ ఆప్షన్ ద్వారా హాలీవుడ్ టైటిల్ కంటెంట్ యాక్సెస్ చేయగలుగుతారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications