Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PAN 2.0: కొత్తగా క్యూఆర్ కోడ్ పాన్ కార్డులు.. మోసాల నుంచి మిమ్మల్ని ఇలా కాపాడతాయ్, తెలుసా?

PAN 2.0 Advantages: దేశంలో అధికారికంగా అనేక పనులు చేయటానికి ముఖ్యమైన కార్డుల జాబితాలో పాన్ కూడా కీలకమైనదని మనందరికీ తెలిసిందే. ఆధార్ తర్వాత పాన్ కార్డును సైతం కేంద్రం విరివిగా అనేక పనులను పూర్తి చేసేందుకు అధికారిక వినియోగానికి ప్రజలను అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆర్థిక పరమైన విషయాల్లో పాన్ కార్డు చాలా అవసరమైనది.

అయితే ఇటీవల కేంద్ర కేబినెట్ పాన్ 2.0 ప్రాజెక్టుకు అంగీకారం తెలిపింది. ఇది పాన్ కార్డులను మోడ్రనైజ్ చేయటం ద్వారా ప్రజలకు మరింత సురక్షితమైన వినియోగాన్ని నిర్థారించాలని చూస్తోంది. అందుకోసం 10 డిజిట్స్ కలిగి ఉండే ఆల్ఫా న్యూమరిక్ కార్డులపై ఇక నుంచి క్యూఆర్ కోడ్ కూడా ఉండేలా చూడాలని కేంద్రం నిర్ణయించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా పన్ను చెల్లింపుదారుల నమోదు ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి సాంకేతికతను ఉపయోగించే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ప్రాజెక్ట్‌గా పాన్ 2.0ని ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Know Advantages of QR code PAN Cards under PAN 2 0 Project How it save you from frauds

అప్‌గ్రేడ్ చేసిన పాన్ కార్డ్‌లలో క్యూఆర్ కోడ్‌తో వస్తాయి. అయితే ఇప్పటికే ఉన్న పాత తెలుపు రంగు లేదా క్యూఆర్ కోడ్ లేని స్మార్ట్ కార్డ్ డిజైన్‌తో ఉన్న పాన్ కార్డులు చెల్లుబాటు అవుతాయని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ పాత డిజైన్‌లను కలిగి ఉన్న పన్ను చెల్లింపుదారులు అదనపు సౌలభ్యం, భద్రత కోసం క్యూఆర్ కోడ్‌ను కలిగి ఉన్న కొత్త పాన్ డిజైన్‌కి అప్‌గ్రేడ్ చేయమని ప్రోత్సహిస్తారు. కొత్త కార్డులు ట్యాంపరింగ్ నిరోధించటానికి దోహదపడతాయి. పైగా వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం క్యూఆర్ కోడ్‌లో ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అధికారం పొందిన వ్యక్తులకు మాత్రమే ఇందులోని డేటా గ్రహించటానికి అనుమతి ఉంటుంది. ఇది మోసగాళ్లు పాన్ యజమాని వివరాలను అక్రమంగా దుర్వినియోగం చేయటాన్ని నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కొత్త పాన్ కార్డ్‌లో క్యూఆర్ కోడ్‌ని చేర్చడం వలన వేగవంతమైన, సమర్థవంతమైన గుర్తింపు ధృవీకరణ అందుబాటులోకి రానుంది. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ధృవీకరణ దాదాపు తక్షణమే జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల సమయంలో ఈ ఫీచర్ ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

క్యూఆర్ కోడ్‌ల గురించి ప్రభుత్వం ఏమి చెప్పింది?

- వాస్తవానికి క్యూఆర్ కోడ్ కొత్త ఫీచర్ కాదు. 2017-18 నుంచి పాన్ కార్డ్‌లలో చేర్చబడింది. పాన్ డేటాబేస్‌లో ఉన్న తాజా డేటాను ప్రదర్శించే డైనమిక్ క్యూఆర్ కోడ్ వంటి మెరుగుదల్లతో PAN 2.0 ప్రాజెక్ట్‌లో అదే కొనసాగుతుంది. క్యూఆర్ కోడ్ లేకుండా పాత పాన్ కార్డ్‌ని కలిగి ఉన్న పాన్ హోల్డర్‌లు ప్రస్తుత పాన్ 1.0 ఎకోసిస్టమ్‌లో అలాగే పాన్ 2.0లో క్యూఆర్ కోడ్‌తో కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

- క్యూఆర్ కోడ్ పాన్.. పాన్ కార్డుదారుని వివరాలను ధృవీకరించడంలో సహాయపడుతుంది.

- ప్రస్తుతం క్యూఆర్ కోడ్ వివరాలను ధృవీకరించడానికి నిర్దిష్ట క్యూఆర్ రీడర్ అప్లికేషన్ అందుబాటులో ఉంది. రీడర్ అప్లికేషన్ ద్వారా సదరు కార్డుదారుని ఫోటో, సంతకం, పేరు, తండ్రి/తల్లి పేరు, పుట్టిన తేదీతో సహా పూర్తి వివరాలు ప్రదర్శించబడతాయి. ఇది ఇతరులు డేటాను దుర్వినియోగం చేయటాన్ని అడ్డుకుంటుంది.

- క్యూఆర్ కోడ్ పాన్ వివరాల ధ్రువీకరణను సులభతరం చేసి ప్రామాణికతను నిర్ధారిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+