కేవలం రూ.10,499 మాత్రమే.. 5000mAh బ్యాటరీ, 64 ఎంపీ కెమెరాతో "లావా బోల్డ్" 5జీ !!
స్మార్ట్ ఫోన్‌ల కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి. కాగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో స్వదేశీ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది "లావా". కాగా లేటెస్ట్ గా " లావా బోల్డ్ 5జీ"ని భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. బడ్జెట్ ధరలో శక్తివంతమైన ఫీచర్లతో రూపొందించిన ఈ ఫోన్, రూ. 10,499 ప్రారంభ ధరతో సాధారణ వినియోగదారులకు సైతం 5జీ అనుభవాన్ని అందించే లక్ష్యంతో విడుదలైంది.
ఈ మోడల్, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. బడ్జెట్ ఫోన్ కేటగిరీ లోనే ప్రీమియం ఫీచర్స్ అందిస్తుండడంతో టెక్ ప్రియులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.

LAVA BOLD 5G ఫీచర్స్..
డిజైన్ & డిస్ ప్లే..
- 6.67 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే (FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్)
- సున్నితమైన, ఆధునిక డిజైన్
- స్పష్టమైన, ప్రకాశవంతమైన దృశ్యాలు గేమింగ్, వీడియోలు, సోషల్ మీడియా కోసం అనుకూలం
- IP64 డస్ట్ & వాటర్ రెసిస్టెంట్ రేటింగ్
పెర్ఫార్మెన్స్..
- మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ (అక్టా-కోర్, 2.4GHz)
- 5జి కనెక్టివిటీ సపోర్ట్
- ఆండ్రాయిడ్ 14 OS
- హైవ్-పెర్ఫార్మెన్స్ మల్టీటాస్కింగ్, వేగవంతమైన బ్రౌజింగ్, హ్యాంగ్ ఫ్రీ సోషల్ మీడియా, వీడియో కాల్స్
స్టోరేజ్..
- 4GB, 6GB, 8GB ర్యామ్ ఆప్షన్స్
- 128GB ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రోSDతో ఎక్స్‌పాండబుల్)
బ్యాటరీ & ఛార్జింగ్..
- 5000mAh లాంగ్-లాస్టింగ్ బ్యాటరీ
- స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ ఫీచర్
- 18W ఫాస్ట్ ఛార్జింగ్
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల సాధారణ వినియోగానికి సరిపోతుంది
కెమెరా..
- 64MP రియర్ కెమెరా (Sony సెన్సార్, AI ఎన్‌హాన్స్‌మెంట్)
- 16MP ఫ్రంట్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం
- 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్
- రియల్‌టైం ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ & నైట్ ఫోటో మోడ్
సెక్యూరిటీ & కనెక్టివిటీ..
- అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- ఫేస్ అన్‌లాక్
- Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC
- డ్యూయల్ సిమ్ సపోర్ట్
కలర్స్..
- సపాయిర్ బ్లూ & షాంపేన్ గోల్డ్
అదనపు ఫీచర్స్..
- గేమ్ మోడ్: ల్యాగ్-ఫ్రీ గేమింగ్ అనుభవం
- డార్క్ మోడ్, ఐకాన్ కస్టమైజేషన్
- AI బేస్డ్ ఫోటో & వీడియో ఎడిటింగ్ టూల్స్
- రియల్-టైం న్యూట్రల్ కలర్ అప్టిమైజేషన్
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications