రూ. 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..?

నేటి ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఫోన్ అనేది ఒక వ్యసనం లాగా మారిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరలోనే ఫోన్లను అందించేందుకు కంపెనీలు సైతం పోటీ పడుతున్నాయి. 10,000 రూపాయల బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా?.. 5G కనెక్టివిటీ, పెద్ద డిస్‌ప్లే, మెరుగైన కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ వంటి ఫీచర్స్ తోనే బెస్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇక మీరు ఎక్కువ గేమింగ్ ఇష్టపడేవాళ్ళు అయితే మంచి ప్రాసెసర్, RAM ఉన్న ఫోన్ ని ఎంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ ఇష్టం ఉన్న వారైతే.. కెమెరా మంచిగా ఉన్న ఫోన్ తీసుకోవచ్చు. డేటా ఎక్కువ వాడే వారైతే 5G ఫోన్ బెటర్. ఎక్కువగా ఫోన్ వాడే వారైతే 5000mAh పైగా బ్యాటరీ ఉన్న ఫోన్ మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. 10 వేల బడ్జెట్ లోనే బెస్ట్ ఫోన్ లను ఓ లుక్కేయండి...

list-of-best-smart-phones-under-10-thousand

రూ. 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్..

1. Redmi A3X - రూ. 6,199..

డిస్‌ప్లే: 6.71 అంగుళాల HD+ ప్యానెల్

RAM & స్టోరేజ్: 3GB RAM, 64GB స్టోరేజ్ (1TB వరకు మైక్రో SD కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు )

బ్యాటరీ: 5000mAh బ్యాటరీ

ప్రాసెసర్: Helio సిరీస్ చిప్‌సెట్

కెమెరా: సాధారణ ఫోటోలు, వీడియో కాల్స్‌కి మంచి కెమెరా సెటప్

స్టూడెంట్లు, పెద్దవాళ్లకు ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది.

2. Infinix Smart 9 HD - ₹6,699

డిస్‌ప్లే: 6.7 అంగుళాల HD+ స్క్రీన్

కెమెరా: 13MP రియర్ కెమెరా + 8MP సెల్ఫీ కెమెరా

ప్రాసెసర్: MediaTek Helio G50

బ్యాటరీ: 5000mAh బ్యాటరీ

Mint Green కలర్ వేరియంట్ లో కూడా ఇది లభిస్తోంది.

3. Poco C75 - ₹7,999

డిస్‌ప్లే: 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లే

కెమెరా: 50MP ప్రైమరీ కెమెరా

బ్యాటరీ: 5160mAh

ప్రాసెసర్: Snapdragon 4s Gen 2 5G

డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్ ఈ ఫోన్ స్పెషాలిటీ

4. Samsung Galaxy F06 5G - ₹9,199

డిస్‌ప్లే: 6.7 అంగుళాల HD+ స్క్రీన్

కెమెరా: 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరాలు; 8MP ఫ్రంట్ కెమెరా

Samsung UI సాఫ్ట్‌వేర్ అనుభవం, OTA అప్‌డేట్స్

RAM & స్టోరేజ్: 4GB RAM, 128GB ROM (1.5TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు)

డిజైన్: ప్రీమియం ఫినిష్ - పబ్లిక్‌లో ఉంచితే హైలైట్ అవుతుంది

5. Motorola G35 5G - ₹9,999

డిస్‌ప్లే: 6.72 అంగుళాల Full HD+ స్క్రీన్

కెమెరా: 50MP ప్రైమరీ + 8MP సెకండరీ బ్యాక్ కెమెరాలు; 16MP ఫ్రంట్ కెమెరా

ప్రాసెసర్: T760 5G చిప్‌సెట్

12 5G బ్యాండ్ సపోర్ట్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+