వీడియో: చందమామపై నిల్చొని గ్రహణ వీక్షణం- అదే వెరైటీ
Blue Ghost Spacecraft: హోలీ పండగ నాడే చంద్ర గ్రహణం ఏర్పడింది. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం. 2022 తరువాత ఇలాంటి ఘటన సంభవించబోతోండటం ఇదే తొలిసారి. ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం- తెల్లవారు జామున 2:26 నిమిషాలకు గ్రహణ కాలం ఆరంభమైంది. 3:31 నిమిషాలకు ముగింది.
కనిపించిన దేశాలివే..
ఈ గ్రహణం భారత్‌లో కనిపించ లేదు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, పసిఫిక్ మహా సముద్రం తీర ప్రాంత దేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. అక్కడి ప్రజలు ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించగలిగారు. అలస్కా, హవాయ్, కెనడా, మెక్సికో సహా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఈ చంద్ర గ్రహణాన్ని క్లిక్‌మనిపించారు.
యూరప్ సహా..
దక్షిణ అమెరికా పరిధిలోని బ్రెజిల్, అర్జెంటీనా, చిలీల్లో ఇది కనిపిస్తుంది. పశ్చిమ యూరప్ రీజియన్‌లో స్పెయిన్, ఫ్రాన్స్, యూకే, ఆఫ్రికాలోని కేప్ వెర్డె, మొరాకో, సెనెగల్.. దేశాల్లో ఈ చంద్ర గ్రహణం కనువిందు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

భూ ఛత్ర ఛాయలో..
సూర్యుడు- భూమి-చంద్రుడు ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం సంభవిస్తుంటుంది. భూమి నీడ పడినప్పుడు చంద్రుడు చీకట్లోకి వెళ్లిపోతాడు. దీన్ని చంద్ర గ్రహణంగా పిలుస్తారనే విషయం తెలిసిందే. భూమి నీడ చంద్రుడిపై కొంతభాగమే పడినప్పుడు అది పాక్షిక చంద్ర గ్రహణం అవుతుంది.
చందమామపై నిల్చుని చూస్తే..
భూమిపై నుంచి చంద్ర గ్రహణాన్ని చూడటం కామన్.. కదా. అదే చందమామపై నుంచి గ్రహణాన్ని వీక్షించగలిగితే. ఎలా ఉంటుంది?. ఓ అద్భుతాన్ని ఆవిష్కరించినట్టవుతుంది. అది సూర్య గ్రహణంగా మారుతుంది. ఎందుకంటే.. చంద్రుడి మీది నుంచి చూసినప్పుడు భూమి నీడలోకి వెళ్లిపోతాడు సూర్యుడు.
ఆ అద్భుతాన్ని చిత్రీకరించింది బ్లూ ఘోస్ట్..
ఆ అద్భుతాన్ని చిత్రీకరించింది బ్లూ ఘోస్ట్ స్పేస్ క్రాఫ్ట్. ప్రస్తుతం ఈ స్పేస్ క్రాఫ్ట్ చందమామ మీదే ఉంది. అక్కడ పరిశోధనలు సాగిస్తోంది. అదే సమయంలో మనకు చంద్ర గ్రహణం ఏర్పడటాన్ని సద్వినియోగం చేసుకుందా బ్లూ ఘోస్ట్. చందమామ పైనుంచి సూర్యగ్రహణాన్ని క్లిక్ మనిపించింది. డైమండ్ రింగ్‌ను క్యాప్చర్ చేసింది.
చందమామపై..
ఈ నెల 3వ తేదీన చందమామపై ల్యాండ్ అయింది బ్లూ ఘోస్ట్. అమెరికా టెక్సాస్‌కు చెందిన ఫైర్ ఫ్లై అనే సంస్థ దీన్ని పంపించింది. సూర్య గ్రహణాన్ని చిత్రీకరించింది బ్లూ ఘోస్ట్ ల్యాండర్‌కు అమర్చిన కెమెరా. ఒక్క సూర్యుడిని మాత్రమే కాదు- మెర్క్యురి, వీనస్ గ్రహాలను సైతం కవర్ చేసింది.
Blue Ghost turns red! Our lander downlinked more imagery from the Moon captured around 2:30 am CDT during the totality of the solar eclipse last night. These images - rapidly captured by our top deck camera with different exposure settings - were stitched together in a quick… pic.twitter.com/BjKPXXhMLx
— Firefly Aerospace (@Firefly_Space) March 14, 2025
అగ్నిపర్వతంపై..
ల్యాండింగ్ కోసం చందమామపై గల మేర్ క్రీసియం ప్రాంతాన్ని ఎంచుకుంది ఫైర్ ఫ్లై. మేర్ క్రీసియం అనేది ఓ బేసిన్. ఈశాన్య క్వాడ్రంట్ దిశలో ఉంటుందిది. దీని విస్తీర్ణం 740 కిలో మీటర్లు. 3.92 బిలియన్ సంవత్సరాల కిందట నెక్టేరియన్ యుగంలో ఇది ఏర్పడి ఉంటుందని నాసా గతంలో ప్రకటించింది.
లూనార్ ఆర్బిటర్ లేజర్ ఆల్టీమీటర్ డేటా..
లూనార్ ఆర్బిటర్ లేజర్ ఆల్టీమీటర్ డేటా ప్రకారం చంద్రుడి ఉపరితలం నుంచి 1.8 కిలో మీటర్లు దిగువన ఉంటుందీ క్రీసియం. దీని బయటి అంచు ఎత్తు 3.34 కిలో మీటర్లు. ఇందులో లావా ప్రవాహ లక్షణాలు ఉన్నట్లు గతంలో నాసా గుర్తించింది. ఇప్పుడు దీని మీదే ఫైర్ ఫ్లై సంస్థ పరిశోధనలు చేయనుంది.
You can also spot Mercury (left) and Venus (right) just above the eclipse! #BGM1 pic.twitter.com/pQoB7I5fuv
— Firefly Aerospace (@Firefly_Space) March 14, 2025
లావా ప్రవహించడం వల్ల..
లావా ప్రవహించడం వల్ల అక్కడ ఏర్పడిన హీట్ ఫ్లో, ఉపరితల వాతావరణ పరిస్థితులను తొలిదశలో అధ్యయనం చేస్తుందీ సంస్థ. థర్మల్ ఎవాల్యూషన్‌కు ఇది ఉపకరిస్తుందని తెలిపింది. చంద్రుడి అయస్కాంత క్షేత్రాలపైనా డేటాను సేకరిస్తుంది. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభమైన తరువాత ఏర్పడబోయే మైనస్ 240 డిగ్రీల చలిలో ఇది ఎలా పని చేస్తుందనేది చర్చనీయాంశమైంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications