Meta: మెటా ప్లాట్‌ఫారమ్స్‌లో లక్షల కొద్దీ అకౌంట్స్ మిస్సింగ్.. వామ్మె, తెరవెనుక ఇంత జరుగుతుందా..?
Pig Butchering: డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంన్న వేళ అదే స్థాయిలో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోయాయి. ప్రభుత్వాలు, RBI సహా బ్యాంకులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజుకో కొత్త పంథాలో కేటుగాళ్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ తరహా ఉదంతాలపై టెక్ మేజర్ మెటా కీలక చర్యలు చేపట్టింది. తన ప్లాట్‌ఫారమ్‌లో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
మోసగాళ్లు ముందుగా ఇతరుల్లో నమ్మకాన్ని పెంచి, తర్వాత వారి నుంచి నగదు దోచుకునే 'పిగ్ బుచరింగ్' ఫ్రాడ్స్‌పై ఉక్కుపాదం మోపుతూ దాదాపు 2 మిలియన్ ఖాతాలను తొలగించింది. ఇందులో నకిలీ రిలేషన్‌షిప్స్‌తో వినియోగదారులను మోసం చేసి, బోగస్ ప్లాన్స్‌లో వారి డబ్బును ఇన్వెస్ట్ చేయమని ప్రలోభపెడతారు. వీటిని సాధారణంగా క్రిప్టోకరెన్సీ వంటి చాలా క్లిష్టమైనవి మోసాలుగా చెబుతారు.

పిగ్ బుచరింగ్‌ను మెరుగ్గా ఎదుర్కొనేందుకు మెటా గత రెండేళ్లుగా కృషి చేస్తోంది. NGOలు, న్యాయ సంస్థలతో కలిసి దక్షిణ ఆసియాలోని పలుచోట్ల దర్యాప్తు చేస్తోంది. కంబోడియాలో ప్రారంభించి, UAE వంటి ఇతర ప్రాంతాలకు కూడా తన ప్రయత్నాలను విస్తరించింది. లక్షల కొద్దీ ఖాతాలను తొలగించి, తన ఇన్వెస్టిగేషన్ వివరాల ద్వారా సోషల్ మీడియా వినియోగదారులను ఈ తరహా మోసాల నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తోంది.
ఈ తరహా పిగ్ బుచరింగ్ సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్ లేదా సాధారణ టెక్స్ట్ మెసేజ్‌తో ప్రారంభమవుతుంది. నేరగాళ్లు నిజమైన మంచి ఫ్రెండ్‌గా నటించి, తదనంతరం లాభదాయకమైన స్కీమ్స్ తనకు తెలుసని, వాటిలో డబ్బు పెట్టడం ద్వారా మరిన్ని ప్రాఫిట్స్ పొందవచ్చని నచ్చజెపుతారు. మరింత నమ్మకం కలిగించేందుకు మొదట్లో కొంత డబ్బును ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇస్తారు. అది నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. చివరికి పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయించి, ఆ నగదుతో అదృశ్యమైపోతారు.
ఇవి ప్రధానంగా ఆసియా దేశాల్లోని వ్యవస్థీకృత నేర సమూహాల ద్వారా నిర్వహించబడతాయి. కంబోడియా, లావోస్, మయన్మార్ వంటి దేశాల్లో ఈ గ్రూప్స్ నకిలీ ఉద్యోగ ప్రకటనల ద్వారా సిబ్బందిని నియమించుకుంటారు. వారు ఉద్యోగంలో చేరాక బలవంతంగా ఇతరులను మోసం చేయవలసిన పరిస్థితి కల్పిస్తారు. క్రమంగా ఇది అంతర్జాతీయ సమస్యగా పరిణమించింది. ఎందుకంటే ఓ నివేదిక ప్రకారం ఈ గ్రూప్స్ 2023లో దాదాపు 3 లక్షల మందిని బలవంతంగా మోసగాళ్లుగా మార్చాయి. ప్రతి ఏటా సుమారు 64 బిలియన్ డాలర్లను చోరీ చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications