Meta technology: కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలో మోటా.. చిట్టి టైప్ రోబోలకు లైన్ క్లియర్
Robot news: పెరుగుతున్న సాంకేతికత ఆధారంగా కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పలు నూతన సాంకేతికతలకు ప్రాణం పోసింది. మెటాకు చెందిన AI పరిశోధన బృందం FAIR రోబోటిక్స్ రంగంలో కీలక ముందడుగు వేసింది. అవి మరింత సమర్థవంతంగా మానవులకు ఉపయోగపడే విధంగా మార్పులు చేసింది.
ఫండమెంటల్ AI రీసెర్చ్ (FAIR) రోబోటిక్స్ రంగంలో కొత్త సాధనాలతో ముందుకు సాగుతోంది. రోబోలకు స్పర్శ, కదలికలతో పాటు మనుషులతో కలిసి పనిచేసే సామర్థ్యాన్ని ఇవ్వడానికి కృషి చేస్తోంది. ఈ ప్రయత్నాలు రోబోలను సాంకేతికంగా మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా సురక్షితంగా మరియు సహజంగా మానవులకు సహాపడే విధంగా రూపొందించేందుకు దోహదపడతాయి.

అధునాతన సెన్సార్లు మరియు వ్యవస్థల ద్వారా రోబోలకు స్పర్శను కల్పించాలని మెటా టీమ్ పనిచేస్తోంది. ఇవి రోబోలను మనుషుల మాదిరిగా సున్నితత్వంతో, అనుకూలంగా పనులు చేసేందుకు వీలు కల్పిస్తాయి. ఆరోగ్యరక్షణ, తయారీ మరియు వర్చ్యువల్ రియాలిటీ రంగాల్లో రోబోల వినియోగానికి త్వరలో అనేక అవకాశాలు పుట్టుకొస్తాయని ఆ బృందం చెబుతోంది.
ఇందులో భాగంగా మెటా స్పర్శ్, మెటా డిజిట్ 360, మెటా డిజిట్ ప్లెక్సస్ అనే మూడు కొత్త సాంకేతికతలను మెటా ఆవిష్కరించింది. స్పర్శ్ అనేది ఒక టచ్-సెన్సింగ్ టెక్నాలజీ. స్పర్శ ద్వారా ఒత్తిడి, కదలికను గుర్తించడంలో ఇది AI కి సాయం చేస్తుంది. ఈ టెక్నాలజీ రోబోకు ఒక సాధారణ స్పర్శ భావనను అందిస్తుంది. డిజిట్ 360 అనేది అధునాతన ఆర్టిఫిషియల్ ఫింగర్‌టిప్. ఇది వేలి గోరుని కూడా కవర్ చేసే శక్తివంతమైన లెన్స్ తో నిర్మించబడింది. తద్వారా అన్ని దిశల్లో చూసేందుకు మరియు వివిధ ఉష్ణోగ్రతలకు స్పందించేందుకు రోబోలకు తోడ్పాటు అందిస్తుంది.
ఇక ప్లెక్సస్ అనేది మల్టిపుల్ టచ్ సెన్సర్లను రోబో హ్యాండ్ లో కలిపే వ్యవస్థ. వేలు గోరు నుంచి చేయి వరకు స్పర్శ భావనను అందిస్తుంది. రోబో హ్యాండ్ల కదలికను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది వైద్య ప్రక్రియలలో సున్నితమైన పనులకు బాగా ఉపయోగపడుతుంది. మెటా అక్కడితో ఆగకుండా జెల్‌సైట్ ఇన్క్ మరియు వోనిక్ రోబోటిక్స్ అనే రెండు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీటి ద్వారా ఈ టచ్-సెన్సింగ్ టూల్స్ ఉత్పత్తి, పంపిణీ చేయనుంది.












Click it and Unblock the Notifications