ఆకాశంలో అద్భుతం- PSLV విఫలం-అయినా ఇస్రోకు డేటా..!

వినువీధిలో తాజాగా ఓ అద్భుతం చోటు చేసుకుంది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన ఓ మిషన్ అనూహ్యంగా మూడో దశలో విఫలమైంది. దీంతో శాస్త్రవేత్తలు నిరాశలో మునిగిపోయారు. కానీ అనుకోకుండా మరో శాటిలైట్ నుంచి డేటా రావడం ప్రారంభమైంది. ఆ సమాచారం కూడా ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నదే కావడంతో తిరిగి అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీన్నో ఖగోళ అద్భుతంగా అభివర్ణిస్తున్నారు.

నిన్న ఇస్రో పీఎస్ఎల్వీ సీ62 వాహక నౌక ద్వారా నిఘా కోసం డీఆర్డీవో యొక్క EOS-N1 (అన్వేష)తో సహా 16-18 ఉపగ్రహాలను శ్రీహరికోట నుండి ప్రయోగించింది. ఇందులో మొదటి రెండు దశలు సాధారణంగా పనిచేశాయి. కానీ మూడవ దశలో చాంబర్ ప్రెజర్ డ్రాప్‌ ఎదురైంది. దీని వలన పీఎస్ఎల్వీ నియంత్రణ కోల్పోయి, దొర్లుకుంటూ పోయి కక్ష్యకు చేరుకోవడంలో విఫలమైంది. గతేడాది మేలో కూడా పీఎస్ఎల్వీ సీ61 వైఫల్యం తర్వాత ఇప్పుడు సీ62 కూడా అలాంటి సమస్యే ఎదుర్కొంది.

Miracle in Orbit Spanish Satellite Overcomes PSLV-C62 Failure Successfully Transmitting Data

ఈ దశలో పీఎస్ఎల్వీ సీ62 శిథిలాల్లో నుంచి ఓ అద్బుతం ఆవిష్కృతమైంది. ఇందులో ప్రయోగించిన స్పానిష్ స్టార్టప్ సంస్ద ఆర్బిటల్ ప్యారడైమ్ దాని కెస్ట్రెల్ ఇనిషియల్ డెమాన్‌స్ట్రేటర్ (KID) క్యాప్సూల్ అద్భుతంగా బయటపడిందని తెలిపింది. తీవ్ర ప్రతికూల పరిస్ధితుల నుంచి బయటపడటమే కాకుండా కీలకమైన డేటాను తిరిగి భూమికి ప్రసారం చేయడం ప్రారంభించిందని వెల్లడించింది. అయితే పూర్తి నివేదికలు రావాల్సి ఉందని పేర్కొంది. షార్ నుంచి ఈ ఏడాది జరిగిన తొలి ప్రయోగం ఇది. అనేక మలుపుల మధ్య KID సాధించిన విజయం ప్రైవేట్ అంతరిక్ష వెంచర్లకు ఒక మైలురాయిగా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+