7000mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరాతో Moto G06 Power.. కేవలం రూ.7,499 !!

టెక్ మార్కెట్‌లో ప్రతిరోజూ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంఛ్ అవుతున్నా.. కొన్ని మాత్రమే ప్రత్యేకతతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇండియన్ మార్కెట్ లో మోటారోలా మొబైల్స్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన పనితీరుతో కస్టమర్లలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బడ్జెట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ వరకు విభిన్న సెగ్మెంట్లలో ఫోన్ లను లాంఛ్ చేస్తూ మార్కెట్ ని పెంచుకుంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా Moto G06 Power స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 15, కెమెరా ఫీచర్లతో టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది.

moto-g06-power-price-and-specifications-details

Moto G06 Power ఫీచర్లు..

భారీ బ్యాటరీ..

ఈ స్మార్ట్ ఫోనులో ప్రధాన హైలైట్ 7000mAh బ్యాటరీ. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బాక్స్‌లోనే 18W ఫాస్ట్ ఛార్జర్ అందించబడుతుంది. పవర్ మేనేజ్‌మెంట్‌ కోసం ప్రత్యేక Battery Health Guard టెక్నాలజీ ఉంది.

డిస్‌ప్లే..

ఈ ఫోన్‌లో 6.88 అంగుళాల HD+ LCD ప్యానెల్ ఉంది.

120Hz రిఫ్రెష్ రేట్ - గేమింగ్, స్క్రోలింగ్ స్మూత్‌గా ఉంటుంది.

600 నిట్స్ బ్రైట్‌నెస్ - బహిరంగ ప్రదేశాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

Corning Gorilla Glass 3 రక్షణతో స్క్రీన్ మరింత బలంగా ఉంటుంది.

పర్ఫార్మెన్స్..

Moto G06 Powerలో MediaTek Helio G81 Ultra చిప్‌సెట్‌ను ఉపయోగించారు, ఇది 12nm ప్రాసెస్ ఆధారంగా రూపొందించబడింది.

4GB LPDDR4X RAM + 64GB స్టోరేజ్ (8GB వరకు వర్చువల్ RAM సపోర్ట్)

1TB వరకు మైక్రోSD ఎక్స్‌పాంషన్ ఆప్షన్

గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు స్మూత్ అనుభవం

కెమెరా..

50MP ప్రైమరీ కెమెరా (f/1.8, LED ఫ్లాష్‌తో)

8MP ఫ్రంట్ కెమెరా (f/2.0) - AI బ్యూటీ మోడ్, ఫేస్ రీటచ్ ఆప్షన్‌లు

FHD వీడియో రికార్డింగ్, పోర్ట్రేట్ మోడ్, నైట్ విజన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఆడియో & మల్టీమీడియా..

స్టీరియో స్పీకర్లు

Dolby Atmos సౌండ్ టెక్నాలజీ - రిచ్, క్లియర్ ఆడియో అనుభవం

FM రేడియో సపోర్ట్, 3.5mm ఆడియో జాక్, USB Type-C పోర్ట్

డిజైన్..

IP64 రేటింగ్ - నీటి చినుకులు, దుమ్ము నుండి రక్షణ

డైమెన్షన్స్: 171.35 × 77.50 × 8.82 mm

బరువు: 220 గ్రాములు

సెక్యూరిటీ..

సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్

Face Unlock సపోర్ట్

కలర్స్..

Tendril Green, Tapestry Blue, Laurel Oak

కనెక్టివిటీ & సాఫ్ట్‌వేర్..

Dual 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz)

Bluetooth 6.0, GPS, USB Type-C

Android 15 OS

2 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు (SMR) గ్యారంటీ

ధర..

వేరియంట్: 4GB RAM + 64GB స్టోరేజ్

ధర: రూ.7,499 మాత్రమే

అక్టోబర్ 11 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. Flipkart, Motorola.in, అలాగే ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లులో లభిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+