అద్భుతం! భూమికి ఇద్దరు చంద్రులు.. ధ్రువీకరించిన నాసా!!
మన భూమికి ఇప్పుడు ఒకే సహజ చంద్రుడు కాకుండా, కొత్తగా మరో తోడు వచ్చి చేరింది! ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కథ కాదు, వాస్తవం అని ఖగోళ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. భూమికి తోడుగా రాబోయే 50 సంవత్సరాల వరకు ప్రయాణించనున్న ఈ కొత్త సహచరుడిని 'మినీ మూన్' అని పిలుస్తున్నారు. ఇది పూర్తిగా వాస్తవమని నాసా ధ్రువీకరించింది. 2025 PN7 అనే పేరుతో పిలవబడుతున్న ఈ గ్రహశకలం(ఆస్టరాయిడ్) రాబోయే 50 ఏళ్ల వరకు మన భూమికి తోడుగా ప్రయాణించనుంది. దీనిని క్వాసీ-మూన్(Quasi-Moon) లేదా అర్థ చంద్రుడుగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 025లో కనుగొనబడిని ఈ మినీ మూన్ సుమారు 18 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఇది చాలా చిన్నదిగా, మసకగా ఉండటం వల్ల ఇన్నాళ్లూ దీనిని గుర్తించలేకపోయారు.
క్వాసీ-మూన్ అంటే ఏమిటనే సందేహం సహజంగానే వస్తుంది. అర్ధ చంద్రుడు అనేది భూమి చుట్టూ తిరుగుతున్నట్లుగా మనకు కనిపించినప్పటికీ, వాస్తవానికి ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి, ఈ గ్రహశకలం రెండూ సూర్యుడి చుట్టూ దాదాపు ఒకే కక్ష్య వేగాన్ని కలిగి ఉండటం వల్ల, ఇది భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నట్లుగా భ్రమ కలుగుతుంది. అంతేకాకుండా భూమి ఒక సంవత్సరం పాటు సూర్యుడి చుట్టూ ప్రయాణించేటప్పుడు, ఈ గ్రహశకలం మన ఆకాశంలో మారుతూ కనిపించే '8' ఆకారంలో కదులుతున్నట్లుగా గమనించవచ్చు.

మన సహజ చంద్రుడితో పోలిస్తే, ఈ అర్ధ చంద్రుడు చాలా భిన్నమైన లక్షణాలను కలిగి ఉంది. మన సహజ చంద్రుడు తన సొంత గురుత్వాకర్షణ శక్తితో భూమిని గట్టిగా పరిభ్రమిస్తూ, కక్ష్యలో అత్యంత స్థిరంగా ఉంటుంది (సుమారు 4.5 బిలియన్ సంవత్సరాలుగా). అయితే అర్ధ చంద్రుడు (2025 PN7) సూర్యుడి చుట్టూ తిరుగుతూనే, భూమి గురుత్వాకర్షణకు పరోక్షంగా కట్టుబడి ఉంటుంది. ఇది పూర్తిగా భూమికి బంధించబడకుండా తన స్వతంత్రతను కాపాడుకుంటుంది. యూరో వీక్లీ న్యూస్ నివేదిక ప్రకారం.. ఈ గ్రహశకలం 2083 వరకు భూమి గురుత్వాకర్షణ పరిధిలో పరోక్షంగా ఉంటుంది. ఆ తర్వాత అది క్రమంగా భూమి కక్ష్య నుంచి బయటికి వెళ్లిపోతుంది.
ఖగోళ శాస్త్రవేత్తలు ఈ క్వాసీ-మూన్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. రాబోయే దశాబ్దాలలో భూమి కక్ష్యను పంచుకునే ఈ దృగ్విషయం చాలా అరుదైనది. అయితే ఈ తాత్కాలిక తోడు వల్ల భూమిపై ఎటువంటి ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications