నాసా సంచలనం: సూర్యుడికి అత్యంత చేరువగా స్పేస్‌క్రాఫ్ట్!

NASA: అంతరిక్ష పరిశోధన చరిత్రలో నాసా మరో సరికొత్త రికార్డు సృష్టించింది. నాసాకు చెందిన 'పార్కర్ సోలార్ ప్రోబ్' అనే అంతరిక్ష నౌక సూర్యుడికి అత్యంత చేరువగా వెళ్లి సంచలనం సృష్టించింది. ఇంతకు ముందు ఏ మానవ నిర్మిత వస్తువూ సూర్యడికి ఇంత దగ్గరగా వెళ్లలేదు. ఈ ప్రయాణంలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ గంటకు 6.87 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది. ఈ వేగం ఎంతంటే ఒకవేళ్ల ఈ స్పేస్‌క్రాఫ్ట్ భూమి మీద ప్రయాణిస్తే.. కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ వరకు ఉన్న దూరాన్ని కేవలం 19 సెకన్లలో చేరుకుంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ మిషన్ ఉద్దేశం ఏమిటి?
ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం సౌర వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన సూర్యుడి గురించి మరింత లోతుగా తెలుసుకోవడం. సూర్యుడికి సంబంధించి ఇప్పటికీ అనేక రహస్యాలు ఉన్నాయి. వాటిని చేధించడమే ఈ మిషన్ లక్ష్యం.

NASA Creates History Spacecraft Reaches Closest Point to the Sun

ఈ మిషన్ ప్రత్యేకతలు
ప్రస్తుతం సూర్యుడు తన 11 ఏళ్ల చురుకైన చక్రంలోకి ప్రవేశించాడు. ఈ సమయంలో సూర్యుడిపై పేలుడు కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ సందర్భంలో పార్కర్ సోలార్ ప్రోబ్ పనితీరు మరింత కీలకంగా మారింది. ఈ మిషన్ ద్వారా సూర్యుడి రహస్యాలను తెలుసుకోవడమే కాకుండా, భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాలను సురక్షితంగా చేయడానికి, భూమిపై సాంకేతిక వ్యవస్థలను కాపాడటానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

నాలుగోసారి వేగ రికార్డు
ఇంత వేగాన్ని పార్కర్ సోలార్ ప్రోబ్ సాధించడం ఇది మొదటిసారి కాదు. ఇద్ గత ఒక సంవత్సరంలో నాలుగోసారి ఇంత వేగాన్ని అందుకుంది. దీనికి ముందు డిసెంబర్ 24, 2024, మార్చి 22, 2025, జూన్ 19, 2025న కూడా ఈ అంతరిక్ష నౌక ఇదే వేగాన్ని చేరుకుంది. సూర్యుడికి దగ్గరగా వెళ్లిన ప్రతిసారీ దాని వేగం, ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం పరీక్షించబడుతుంది.

సైంటిస్టులకు అరుదైన అవకాశం
పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడి బాహ్య వాతావరణం గుండా వెళ్తూ.. దాని సోలార్ విండ్, ఫ్లేర్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్ వంటి సంఘటనల నుంచి కీలకమైన డేటాను సేకరిస్తోంది. ఈ సమాచారం భూమిపై అంతరిక్ష వాతావరణం (స్పేస్ వెదర్) ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి, దానిని ముందే అంచనా వేయడానికి చాలా కీలకమైనది ఎందుకంటే అంతరిక్ష వాతావరణం ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, విద్యుత్ గ్రిడ్‌లపై ప్రభావాన్ని చూపగలదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+