460 అడుగుల భారీ అస్టరాయిడ్- నాసా అలర్ట్
Asteroid to Earth: అంతరిక్షంలో గతి తప్పిన ఓ గ్రహశకలం మొన్నటివరకూ భూమండలాన్ని వణికించింది. భయాందోళనలకు గురి చేసింది. 2032లో భూమిని ఢీ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇచ్చిన స్టేట్‌మెంట్ దీనికి ప్రధాన కారణం.
విశ్వాంతరాల్లో గ్రహ శకలాలు, ఉల్కాపాతాలు సర్వసాధారణమే. అవి దారి తప్పి దిశా తెన్నూ లేకుండా తిరుగాడుతుంటాయి. గతంలో అనేక అస్టరాయిడ్స్ భూమికి అత్యంత సమీపంలో దూసుకెళ్లిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. అస్టరాయిడ్ 2024 వైఆర్ 4- 2032లో భూమిని ఢీ కొట్టడానికి 3.1 శాతం అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఆ తరువాత దాన్ని సవరించింది. ఈ గ్రహ శకలం భూమిని ఢీ కొట్టడానికి గల అంచనాల శాతాన్ని 0.004 శాతానికి కుదించింది.

ఇప్పుడు తాజాగా మరో గ్రహ శకలం భూమికి అతి చేరువగా సమీపించినట్లు వెల్లడించింది నాసా. దీని పేరు ఆస్టరాయిడ్ 535844 (2015 బీవై 310). ఇది అసాధారణంగా వేగంతో భూమి వైపు దూసుకువస్తోంది. భూమికి 3.67 మిలియన్ కిలోమీటర్ల దూరంలో- అంటే భూమి, చంద్రుడికి మధ్య దూరం కంటే దాదాపు 9.5 రెట్ల దూరంలో ఈ అస్టరాయిడ్ ప్రయాణిస్తుందని నాసా అంచనా వేసింది.
ఈ ఆస్టరాయిడ్ అంతరిక్షంలో గంటకు 28,298 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తోండటం నాసాను ఆందోళనకు గురి చేస్తోంది. ఇది- భూమిని ఢీ కొడితే సంభవించే ఉపద్రవం అనూహ్యంగా ఉంటుందని చెబుతోంది. నాసా సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ అధునాతన రాడార్ వ్యవస్థ, టెలిస్కోప్‌లను ఉపయోగించి దాని మార్గాన్ని నిశితంగా పరిశీలిస్తోంది.
ఆస్టరాయిడ్ 535844 వంటి గ్రహ శకలాలు అంతరిక్ష పరిశోధనలకు అతి కీలంకంగా భావిస్తారు శాస్త్రవేత్తలు. వాటిపై సమగ్రంగా అధ్యయనం చేయగలిగితే- నాలుగున్న బిలియన్ సంవత్సరాల కిందట సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందనడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది.
అతి ప్రాచీన అంతరిక్ష శిలలు/గ్రహ శకలాలు- గ్రహాల పరిణామం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు వెసలుబాటు కల్పిస్తుంది. నియర్- ఎర్త్ అబ్జెక్ట్స్ కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం కూడా అంతరిక్ష పరిశోధనల్లో కీలకం. భవిష్యత్తులో అవి భూమిని ఢీ కొట్టడానికి గల అవకాశాల గురించి తెలుసుకోవడానికి దోహదపడతాయి.












Click it and Unblock the Notifications