అంతుచిక్కట్లేదు- ఈ అస్టరాయిడ్లతో ఎప్పటికైనా ముప్పే: నాసా ఆందోళన

అనంత విశ్వంలో భారీ గ్రహశకలాలు నిశ్శబ్దంగా, కంటికి కనిపించకుండా తిరుగుతూ ఉంటాయి. అపారమైన విధ్వంసక శక్తి వీటి సొంతం. తమ మార్గంలో ఏ గ్రహంతోనైనా ఢీకొట్టగలవు. ఆ ప్రదేశాన్ని భస్మీపటలం చేయగలవు. భూమికీ వాటి ముప్పు లేకపోలేదు. ఆధునిక ప్రపంచంలో ఇప్పటివరకు ఆ స్థాయిలో గ్రహ శకలాలేవీ కూడా పెద్దగా భూమిని ఢీ కొట్టిన సందర్భాలు లేవు గానీ.. ఈ ప్రమాదం మాత్రం పొంచివుందనే చెబుతోంది నాసా.

అలాంటి గతి తప్పిన అస్టరాయిడ్ ఒకటి భూమి వైపు దూసుకొస్తోందని నాసా తాజాగా హెచ్చరించింది. వేల కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తోన్న అంతరిక్ష శిలల నుంచి భూమికి రక్షణకవచం అంటూ ఏదీ లేకపోవడంతో ఇవి ప్రపంచంలో ఎక్కడైనా.. ఏ ప్రాంతాన్నయినా నాశనం చేయగలవని నాసా ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ చీఫ్ డాక్టర్ కెల్లీ ఫాస్ట్ ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో కనుగొన్న ఓ భారీ అస్టరాయిడ్ భూమి వైపు దూసుకొస్తోందని, దీని విస్తీర్ణం కిలోమీటర్ కంటే పెద్దదని తెలిపారు.

NASA Scientist Says 15000 Undetected Asteroids Pose Threaten City Killers A Sleepless Night Warning

భూమికి అత్యంత సమీపంలోని 25,000 అస్టరాయిడ్స్ తిరుగుతుంటాయని, వీటిల్లో 40 శాతం మాత్రమే ఇప్పటివరకు గుర్తించినట్లు కెల్లీ ఫాస్ట్ పేర్కొన్నారు. వాటి స్థితిగతులు, పరిభ్రమణ కాలం, వేగం, ఎక్కడున్నాయో తెలుసుకోగలిగామని, మరో 15,000 గ్రహ శకలాల గురించి అంతుచిక్కట్లేదని వ్యాఖ్యానించారు. ఇవి భూమితో సూర్యుని చుట్టూ తిరగడం వల్ల సూర్యరశ్మి ప్రతిబింబించదని అందువల్ల వీటిని గుర్తించడం కష్టమని వివరించారు.

ఈ అడ్డంకిని అధిగమించడానికి వచ్చే ఏడాదినియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ సర్వేయర్ టెలిస్కోప్‌ను ప్రయోగించనున్నట్లు ఆమె వెల్లడించారు. హైపో థర్మల్ యాక్టవిటీస్ ద్వారా అజ్ఞాతంలో ఉన్న అస్టరాయిడ్లను గుర్తించడం సులభతరమౌతుందని అన్నారు. గ్రహశకలాలు భూకక్ష్యలోకి చేరడానికి ముందే వాటిని కనుగొనడం తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఒకవేళ వాటిని గుర్తించినప్పటికీ సిటీ కిల్లర్ టైప్ భారీ అస్టరాయిడ్లను ఆపడం కష్టమేనని స్పష్టం చేశారు.

విశ్వాంతరాల్లో గ్రహ శకలాలు, ఉల్కాపాతాలు సర్వసాధారణమే అయినప్పటికీ.. దారి తప్పి దిశా తెన్నూ లేకుండా తిరుగాడుతుంటాయని, వాటి కదలికలను పసిగట్టడం సవాల్ తో కూడుకుని ఉన్నదని కెల్లీ ఫాస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా వైఆర్4 గ్రహశకలం గురించి ప్రస్తావించారు. 2032లో భూమిని ఢీ కొట్టడానికి 3.1 శాతం అవకాశాలు ఉన్నాయంటూ ఇదివరకు నాసా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి తేదీని కూడా ఖరారు చేసింది.

2032 డిసెంబర్ 22వ తేదీన ఈ అస్టరాయిడ్ భూమిని ఢీ కొడుతుందని అప్పట్లో వెల్లడించింది. ఆ తరువాత ఆ అవకాశం లేదని తేల్చిచెప్పింది. ఇదే ముప్పు.. చందమామకు పొంచివుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2032లో భూమికి అతి సమీపం నుంచి దూసుకెళ్లే ఈ గ్రహశకలం నేరుగా చంద్రుడిని ఢీ కొడుతుందని నాసా వెల్లడించింది. జేమ్స్ వెబ్ స్పేస్ నియర్ ఇన్ ఫ్రారెడ్ టెలిస్కోప్ ద్వారా ఆ గ్రహశకలం కదలికలను అంచనావేశామని, ఆ తరువాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+