Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియాలో ఫస్ట్ టైం ఆ ఫీచర్‌తో " OnePlus 15 " లాంఛ్.. ఎంతంటే ??

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి పేరు పొందింది. వినియోగదారులకు ప్రీమియమ్ అనుభవం అందించడమే లక్ష్యంగా పనిచేసే ఈ సంస్థ, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. చైనాలో ఇప్పటికే రిలీజ్ అయిన 'వన్‌ప్లస్‌ 15' భారతదేశంలో కూడా లేటస్ట్ గా లాంచ్ చేసింది.

ఈ మోడల్ శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్‌తో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇండియాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో విడుదలైన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. డిజైన్ పరంగా, పనితీరు పరంగా, కెమెరా పరంగా పూర్తిగా అప్‌గ్రేడ్ అయిన ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ గా వన్‌ప్లస్ 15 టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ రూ.72,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి రాగా.. 12GB+256GB, 16GB+512GB వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

oneplus-15-price-and-specifications-details

వన్‌ప్లస్ 15 ఫీచర్లు..

ప్రాసెసర్ & పనితీరు..

  • భారతదేశంలో తొలి Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్
  • వన్‌ప్లస్ ప్రత్యేక ట్రిపుల్-చిప్ ఆర్కిటెక్చర్
  • Main Processor
  • Dedicated Touch-Response Chip (3200 Hz Instant Touch Sampling)
  • Independent Wi-Fi Chip
  • గేమింగ్, AI ప్రాసెసింగ్, మల్టీటాస్కింగ్‌లో అత్యద్భుత వేగం
  • నూతన AI ఆప్టిమైజేషన్‌తో మెరుగైన పవర్ మేనేజ్‌మెంట్

కూలింగ్ సిస్టమ్..

  • 360 Cryo-Velocity Cooling System
  • Aerogel ఇన్సులేషన్ + White Graphite మెటీరియల్
  • దీర్ఘకాల గేమింగ్‌లో కూడా ఫోన్ వేడి తగ్గించి స్థిరమైన పనితీరును అందిస్తుంది

డిస్‌ప్లే..

  • 1.5K 165 Hz LTPO Display
  • 1800 nits పీక్ బ్రైట్‌నెస్
  • TÜV Rheinland Intelligent Eye Care 5.0 సర్టిఫికేషన్
  • Adaptive Refresh Rate → బ్యాటరీ సేవింగ్
  • 4K 120 fps Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్
  • కంటెంట్ క్రియేటర్‌ల కోసం LOG రికార్డింగ్ + Real-time LUT Preview

బ్యాటరీ & ఛార్జింగ్..

  • వన్‌ప్లస్‌లో ఇప్పటివరకు లేని భారీ 7300mAh Silicon Nanostack Battery
  • 120W SuperVOOC Wired - 39 నిమిషాల్లో పూర్తి ఛార్జ్
  • 50W AIRVOOC Wireless Charging
  • 4 సంవత్సరాల తర్వాత కూడా 80% బ్యాటరీ హెల్త్
  • -20°C లో కూడా ప్రదర్శన తగ్గకుండా పనిచేస్తుంది

కెమెరా..

  • ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ (Detail Max Engine తో)
  • 50MP Main Sensor + OIS
  • 50MP Ultra Wide + Autofocus + Macro Capability
  • 50MP Periscope Telephoto
  • 3.5x Optical Zoom
  • 7x Lossless Zoom
  • నైట్ ఫొటోగ్రఫీ, మోషన్ షాట్స్, హై డైనమిక్ రేంజ్‌లో భారీ మెరుగుదల

సాఫ్ట్‌వేర్ & AI ఫీచర్లు..

  • Android ఆధారిత OxygenOS 16
  • OnePlus AI సూట్ + Google Gemini ఇంటిగ్రేషన్
  • Plus Mind Gesture Save → ఒకే టచ్‌తో ఆన్‌స్క్రీన్ కంటెంట్ సేవ్
  • AI Writer → ఆటో టెక్స్ట్ జనరేషన్
  • AI Recorder → తెలివైన ట్రాన్స్‌క్రిప్షన్
  • AI Portrait Glow → ఫోటోలలో ఆటోమేటిక్ బ్యూటీ & లైటింగ్

కలర్స్..

  • Infinite Black
  • Sand Storm
  • Ultra Violet

డిజైన్ & బిల్డ్ క్వాలిటీ..

  • ఫ్లాట్ ఫ్రేమ్ + 1.15 mm అల్ట్రా స్లిమ్ బెజెల్స్
  • బలమైన నిర్మాణం కోసం LIPO Technology
  • IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లు
  • నీరు, దుమ్ము, ప్రెషర్, హై టెంపరేచర్‌కు పూర్తిగా రెసిస్టెంట్

ధరలు & ఆఫర్లు..

  • 12GB+256GB వేరియంట్ ధర రూ.72,999
  • 16GB+512GB వేరియంట్ ధర రూ.79,999

బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లపై అదనంగా రూ.4,000 తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. OnePlus.in, అమెజాన్ సహా ప్రధాన రిటైల్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఫ్రీ గిఫ్ట్స్:

లిమిటెడ్‌ పీరియడ్‌ ఆఫర్‌ కింద వన్‌ప్లస్ నార్డ్‌ బడ్స్‌ 3ని ఉచితంగా కంపెనీ ఇస్తోంది. అలానే 180 Days Phone Replacement Plan, Lifetime Display Warranty, Google AI Pro 3 Months Trial లను అందిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+