Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

7500mAh భారీ బ్యాటరీతో OnePlus 15T లాంఛ్..!

ఇండియన్ మార్కెట్ లో వన్ ప్లస్ మొబైల్స్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి పేరు పొందింది. వినియోగదారులకు ప్రీమియం అనుభవం అందించడమే లక్ష్యంగా పనిచేసే ఈ సంస్థ.. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన మొబైల్స్ మంచిగా సక్సెస్ అయ్యాయి. కాగా మారుతున్న టెక్ కాలానికి తగ్గట్టు కొత్తకొత్త ఫీచర్లతో నూతన స్మార్ట్ ఫోన్ లను లాంఛ్ చేస్తూ మార్కెట్ ని పెంచుకుంటుంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న OnePlus.. మరోసారి పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. హై-పర్ఫార్మెన్స్, గేమింగ్-ఫోకస్, భారీ బ్యాటరీలతో పేరుగాంచిన ఈ బ్రాండ్ ఇప్పుడు తన తాజా డివైస్ OnePlus 15Tను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ను మార్చి 25, 2026న చైనా మార్కెట్లో లాంచ్ చేశారు. Oppo China ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఉదయం 10 గంటల నుంచి విక్రయాలకు అందుబాటులోకి వచ్చింది.

oneplus-15t-5g-new-mobile-launched-in-china-and-full-specifications-price-details-along-with-availab

OnePlus 15T ఫీచర్స్..

ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో వస్తోంది:

  • హీలింగ్ వైట్ చాక్లెట్
  • ప్యూర్ కోకో
  • రిలాక్సింగ్ మచ్చా

ధరలు & వేరియంట్లు..

12GB + 256GB - CNY 4,299 (~₹58,000)
12GB + 512GB - CNY 4,899 (~₹67,000)
16GB + 256GB - CNY 4,599 (~₹63,000)
16GB + 512GB - CNY 5,199 (~₹71,000)
16GB + 1TB - CNY 5,699 (~₹78,000)

డిస్‌ప్లే..

  • OnePlus 15Tలో 6.32-అంగుళాల AMOLED డిస్‌ప్లే అందించారు.
  • ఫుల్ HD+ (1216×2640 పిక్సెల్స్)
  • 165Hz రిఫ్రెష్ రేట్ (ఎంచుకున్న గేమ్స్‌కు మాత్రమే)
  • 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్
  • 460 ppi డెన్సిటీ
  • TÜV Rheinland Eye Protection 5.0

గేమింగ్, వీడియోల కోసం స్మూత్ విజువల్స్ అందిస్తుంది.

పనితీరు (Performance)..

  • ఈ ఫోన్‌లో తాజా Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ఉంది.
  • 3nm ప్రాసెస్ టెక్నాలజీ
  • E-sports Triple Core సిస్టమ్
  • Lingxi Touch Chip (ఫాస్ట్ టచ్ రెస్పాన్స్)
  • G2 Wi-Fi చిప్
  • Wind Chaser Gaming Kernel
  • AnTuTu స్కోర్: 44.5 లక్షలకు పైగా - ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరు.

RAM & స్టోరేజ్..

  • 16GB వరకు LPDDR5X RAM
  • 1TB వరకు UFS 4.1 స్టోరేజ్
  • హెవీ గేమ్స్, మల్టీటాస్కింగ్ కోసం బెస్ట్ సెటప్.

కెమెరా..

  • 50MP Sony Ultra Vision ప్రైమరీ కెమెరా
  • 50MP పెరిస్కోప్ టెలిఫోటో (3.5x ఆప్టికల్ జూమ్)
  • 7x లాస్‌లెస్ జూమ్
  • 16MP ఫ్రంట్ కెమెరా

వీడియో:

  • 8K @30fps రికార్డింగ్
  • OPPO LUMO ఇమేజింగ్ ఇంజిన్
  • నైట్ ఫోటోగ్రఫీ, జూమ్ షాట్స్‌లో మంచి పనితీరు.

బ్యాటరీ & ఛార్జింగ్..

  • OnePlus 15Tలో భారీ 7,500mAh బ్యాటరీ ఉంది.
  • 100W SUPERVOOC వైర్డ్ ఛార్జింగ్
  • 50W వైర్‌లెస్ ఛార్జింగ్
  • 22.8 గంటల వీడియో ప్లేబ్యాక్
  • దీర్ఘకాల వినియోగానికి సరైన ఎంపిక.

కనెక్టివిటీ..

  • 5G, 4G LTE
  • Wi-Fi 7
  • Bluetooth
  • NFC
  • USB Type-C

గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్..

GPS, GLONASS, BeiDou, Galileo, QZSS

సెక్యూరిటీ & సెన్సార్లు..

  • ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్
  • ఫేస్ అన్‌లాక్
  • ప్రాక్సిమిటీ, లైట్, గ్రావిటీ, ఓరియంటేషన్, ఆల్టిట్యూడ్

బిల్డ్ క్వాలిటీ & ప్రొటెక్షన్..

ఈ ఫోన్‌కు IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయి.

  • డస్ట్ ప్రూఫ్
  • వాటర్ రెసిస్టెంట్
  • హై ప్రెషర్ వాటర్ జెట్స్‌కీ సేఫ్
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+