Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెస్ట్ ఫీచర్లతో మిడ్ రేంజ్ బడ్జెట్ లోనే Oppo A6 5G.. ఎంతంటే ?

చిన్నారుల నుంచి పెద్దల వరకు ఫోన్ లేకపోతే సమయం గడవదు అనే స్థాయికి వచ్చేశారు. ఇక మార్కెట్ లో రోజుకో కొత్త ఫోన్ లాంఛ్ అవుతోంది. కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో ఫోన్స్ లాంఛ్ చేస్తున్నారు. ఒప్పో మొబైల్స్ ఇండియన్ మార్కెట్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ మేరకు చైనా మార్కెట్లో ఒప్పో మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

Oppo కొత్తగా A6 5G మోడల్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. అందులో ముఖ్యంగా 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించింది. అలానే అధునాతన MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌తో నడిచే ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది. ఫ్లాగ్ షిప్ రేంజ్ ఫీచర్లతో మిడ్ రేంజ్ బడ్జెట్ లోనే ఈ ఫోన్ రావడం బాగా కలిసొచ్చే విషయం.

oppo-a6-5g-price-and-specifications-details

Oppo A6 5G ఫీచర్లు..

ప్రాసెసర్..

ఆండ్రాయిడ్ 15 ఆధారిత కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్

ఈ ఫోన్ Android 15 ఆధారిత ColorOS 15 పై పనిచేస్తుంది. నూతన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ ద్వారా మెరుగైన పనితీరు, మెరుగైన ప్రైవసీ ఫీచర్లు, స్మార్ట్ మల్టీ-టాస్కింగ్ ఆప్షన్లు అందించబడుతున్నాయి.

డిస్‌ప్లే..

Oppo A6 5Gలో 6.57-అంగుళాల Full-HD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, మరియు 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. 93% స్క్రీన్-టు-బాడీ రేషియోతో, ఈ ఫోన్ గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు అద్భుత అనుభవం ఇస్తుంది.

పర్ఫార్మెన్స్..

Oppo A6 5Gలో MediaTek Dimensity 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇందులో 2.4GHz క్లాక్ స్పీడ్ కలిగిన రెండు హై-పర్ఫార్మెన్స్ కోర్లు, ఆరు పవర్ ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి.
ఇది Mali-G57 MC2 GPU, 12GB LPDDR4X RAM, మరియు 512GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. అవసరమైతే microSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు.

కెమెరా..

వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది:

50MP వైడ్ యాంగిల్ లెన్స్ (f/1.8, 27mm)

2MP మోనోక్రోమ్ సెన్సార్ (f/2.4, 22mm)

సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP (f/2.4) కెమెరా ఉంది. ముందు, వెనుక కెమెరాలు రెండూ 1080p వీడియో రికార్డింగ్ @ 60fps సపోర్ట్ చేస్తాయి. అదనంగా, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, AI బ్యూటిఫికేషన్, HDR వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ & ఛార్జింగ్..

ఈ ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీ ఉంది, ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ప్రకారం, 30 నిమిషాల్లో 60% వరకు ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ పరంగా ఇది మార్కెట్లోని ఇతర 5G ఫోన్లకంటే ముందుంటుందని ఒప్పో చెబుతోంది.

భద్రత & సెన్సార్ ఫీచర్లు

భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, అలాగే యాక్సిలెరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇలెక్ట్రానిక్ కంపాస్ వంటి సెన్సార్లు అందించబడ్డాయి.
ఫోన్‌కి IP69 రేటింగ్ ఉండటంతో ఇది నీరు, దుమ్ము నుండి రక్షణ కల్పిస్తుంది.

ధర..

ఒప్పో A6 5G ధర CNY 1,599 (సుమారు ₹20,000) నుండి ప్రారంభమవుతుంది. ఇది 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర. ఇంకా 12GB RAM + 256GB మరియు 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్స్ ధరలను కంపెనీ త్వరలో వెల్లడించనుంది.

కలర్స్..

ఈ ఫోన్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

బ్లూ ఓషన్ లైట్

వెల్వెట్ గ్రే

పింక్

కనెక్టివిటీ ఆప్షన్లు..

ఫోన్‌లో 5G SA/NSA, 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.3, USB Type-C, GPS, NFC సపోర్ట్ ఉన్నాయి. ఆడియో సెగ్మెంట్‌లో స్టీరియో స్పీకర్లు మరియు హై-రిజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్ ఇవ్వబడ్డాయి.

కాగా 5G స్మార్ట్‌ఫోన్ విభాగంలో Oppo A6 5G ఒక గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ధర రేంజ్ లో ఉన్న Redmi Note 14 Pro+, Realme 12+, Samsung M15 5G మోడళ్లుగా గట్టి పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+