Asteroid 2024 BR4:భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం..పొంచి ఉన్న ప్రమాదం..?
Asteroid 2024 BR4:వాలెంటైన్స్ డే రోజు ఖగోళ అద్భుతం జరగబోతోంది. 2024 BR4గా పిలువబడే ఒక గ్రహశకలం భూమికి చాలా దగ్గరగా వస్తుందని అంతరిక్షశాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని వ్యాసం 140 నుంచి 310 మీటర్ల వరకు ఉంటుంది. ఇదొక ఆకాశ హర్మ్యాం యొక్క పరిమాణాన్ని పోలి ఉంటుంది. ఈ గ్రహ శకలం భూమికి 4.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంది. భూమి నుంచి చంద్రుడికి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే 2024 BR4 గ్రహ శకలం 12 రెట్లు తక్కువ దూరం ఉంటుంది.
జనవరి 30వ తేదీన కాటలీనా స్కై సర్వే ఈ భారీ గ్రహశకలాన్ని కనుగొనింది.అత్యంత వేగంగా ప్రయాణించే 2024 BR4 గ్రహశకలం అపొలోస్ అనే వర్గం కింద చేర్చడం జరిగింది.భూకక్ష్యను దాటి ఈ శకలం విస్తరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లోబల్ వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్‌లో భాగంగా సెలస్ట్రాన్ రోబోటిక్ యూనిట్‌తో ఈ మధ్యే ఈ గ్రహశకలంకు సంబంధించిన ఫోటోను బంధించడం జరిగింది.120 సెకన్ల నిడివి ఉన్న ఈ చిత్రంలో చాలా విషయాలు బయటపడ్డాయి.

ఈ చిత్రాన్ని తీసిన సమయంలో 2024 BR4 గ్రహశకలం భూమికి 12 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నింది. భూమికి దగ్గరగా ప్రయాణిస్తున్నట్లు గమనించారు. ఈ గ్రహ శకలం యొక్క స్థితిగతులను సెలస్ట్రాన్ సీ 14 +పారామౌంట్ ఎంఈ+ఎస్‌బీఐజీ ఎస్‌టీ8-ఎక్స్ఎంఈ రోబోటిక్ యూనిట్‌తో తీయడం జరిగింది.
ఇక భూమికి 4.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రహశకలం.. భూమికి చంద్రుడికి సగటున 12 రెట్ల కంటే తక్కువ దూరంలో ఉందని నిపుణులు తెలిపారు. అయితే భూమికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉండదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు అంతరిక్షం నుంచి 33వేల గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చినప్పటికీ వాటి ప్రభావం పెద్దగా లేదని ప్రముఖ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా వెల్లడించింది. 2024 BR4 గ్రహ శకలం భూమికి దగ్గరగా వచ్చినప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపదని నాసా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసింది.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications