పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. చందమామ రూపు మారబోతోంది.

చందమామ తన రూపును మార్చుకుంటూ ఆకాశంలో ఇచ్చే అద్భుత ప్రదర్శనలను చూడటానికి ఖగోళ ప్రేమికులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గతేడాది ఆగస్టులో సంభవించిన పాక్షిక చంద్రగ్రహణం మన భారతీయులకు కనిపించక నిరాశ పరిచినప్పటికీ, ఈసారి మాత్రం ఆ కొరత తీరనుంది. ఆకాశంలో మరో అరుదైన, ఆసక్తికరమైన ఖగోళ వింతకు వేదిక సిద్ధమవుతోంది. ప్రసిద్ధ ఖగోళ పరిశోధనా సంస్థల సమాచారం ప్రకారం.. త్వరలోనే భారత ఆకాశంలో 'ఛాయా చంద్రగ్రహణం' (పెనుంబ్రల్ లూనార్ ఎక్లిప్స్) ఆవిష్కృతం కానుంది.

తెల్లవారుజామునే వింత.. మన దేశంలో స్పష్టంగా!

ఈ గ్రహణ ఘట్టం 2027 ఫిబ్రవరి 20, 21 తేదీల మధ్య రాత్రి సంభవించనుంది. ముఖ్యంగా భారత ప్రామాణిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి 21 తెల్లవారుజామున 2:42 గంటలకు గ్రహణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 4:42 గంటల సమయంలో ఇది పీక్ స్టేజ్ చేరుకుంటుంది. చివరికి ఉదయం 6:43 గంటల ప్రాంతంలో ముగుస్తుంది. సుమారు 4 గంటల పాటు అంటే.. 240 నిమిషాలు సాగే ఈ అరుదైన దృశ్యాన్ని మన దేశంలోని ప్రజలంతా తెల్లవారుజామున స్పష్టంగా వీక్షించవచ్చు. భారత్‌తో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని చాలా ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది.

Penumbral Lunar Eclipse February 2027 Check Exact India Timings Visibility And Skywatching Viewing Tips
విశ్వంలో మరో రెండు కొత్త గ్రహాలు.. శాస్త్రవేత్తల మైండ్ బ్లాకింగ్ న్యూస్!
విశ్వంలో మరో రెండు కొత్త గ్రహాలు.. శాస్త్రవేత్తల మైండ్ బ్లాకింగ్ న్యూస్!

అసలు ఏమిటీ 'ఛాయా గ్రహణం'?

సాధారణంగా సంభవించే సంపూర్ణ లేదా పాక్షిక చంద్రగ్రహణాల సమయంలో చందమామపై నల్లటి నీడపడి రంగు మారుతుంది. కానీ ఈ 'ఛాయా గ్రహణం'లో అలా జరగదు. సూర్యుడి కాంతి చంద్రుడిపై పడకుండా భూమి చుట్టూ ఉండే చాలా స్వల్పమైన వెలుపలి నీడ (పెనుంబ్రా) అడ్డుగా వస్తుంది. దీనివల్ల చందమామ నల్లగా మారకుండా, తన కాంతిని కొద్దిగా కోల్పోయి స్వల్పంగా మసకబారినట్లు కనిపిస్తాడు. అందుకే దీనిని 'పెనుంబ్రల్' లేదా ఛాయా గ్రహణం అంటారు. ఈసారి ఫిబ్రవరిలో వచ్చే పౌర్ణమి రోజే ఈ గ్రహణం ఏర్పడుతుండటం మరొక విశేషం.

NASA మైండ్ బ్లోయింగ్ ప్రయోగం! రోమన్ టెలిస్కోప్ సృష్టించబోయే సంచలనాలివే
NASA మైండ్ బ్లోయింగ్ ప్రయోగం! రోమన్ టెలిస్కోప్ సృష్టించబోయే సంచలనాలివే

ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?.. ఎలా చూడాలి?

సూర్యగ్రహణాన్ని చూసినట్లుగా దీనికి ఎలాంటి ప్రత్యేక సోలార్ గ్లాసెస్ లేదా ఫిల్టర్లు వాడాల్సిన అవసరం లేదు. ఛాయా గ్రహణాన్ని నేరుగా కళ్లతోనే హాయిగా వీక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. చందమామ కాంతిలో వచ్చే స్వల్ప మార్పును స్పష్టంగా చూడాలనుకునేవారు బైనాక్యులర్స్ లేదా చిన్న టెలిస్కోప్ ఉపయోగిస్తే మరింత బాగా ఆస్వాదించవచ్చు. ఏది ఏమైనా, ప్రకృతి ప్రేమికులకు , ఆకాశంలో వింతలను ఇష్టపడేవారికి ఈ తెల్లవారుజామున ఒక మంచి అనుభూతి లభించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+