పోకో నుంచి త్వరలో M సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌. ధర మాత్రం అసలు ఊహించి ఉండరు

భారత్ మార్కెట్లో తన కంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకున్న POCO బ్రాండ్.. ఇప్పుడు మరో కొత్త సిరీస్ తో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్ధమైంది.POCO M8 Pro 5G Smartphone విడుదల కానుంది. ఈ ఫోన్‌ జనవరి 2026 లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కచ్చితమైన తేదీ వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు లీక్‌ అయ్యాయి.

సూపర్ కెమెరా ఫీచర్స్, అదిరిపోయే డిస్‌ప్లే

ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌(OIS) సపోర్టుతో50MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తుంది. వెనుక వైపు రెండు కెమెరాలు ఉండగా.. కెమెరా విభాగం పరంగా 50MP AI ప్రైమరీ కెమెరా.. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉంటుందన్నారు. వెనుక వైపు LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో లాంచ్‌ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఫోన్‌ 6.83 అంగుళాల 1.5K (2772 x 1280 పిక్సల్స్‌) క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రీఫ్రెష్‌ రేట్‌120Hz కాగా.. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ ఉండబోతుంది.

POCO M8 Pro 5G Launch Date Price amp amp Key Specifications in India

ప్రాసెసర్..

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. పోకో M8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తుందని తెలిపారు.

ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ బిగ్ బ్యాటరీ..

ఈ హ్యాండ్‌సెట్‌ 100W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వైఫై 5, బ్లూటూత్‌ 5.4, IR బ్లాస్టర్‌ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ 7.9mm థిక్‌నెస్‌తో 207 గ్రాముల బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ధర ఎంతంటే..

పోకో M8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా మనకు అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ రూ.20 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా . అయితే ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లపై పోకో ఎటువంటి అధికారిక స్పందన తెలియజేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+