రేపటి నుంచే గ్రహాల జాతర! 60 ఏళ్ల తర్వాత నింగిలో అరుదైన దృశ్యం!

అంతరిక్షంలో అప్పుడప్పుడు జరిగే వింతలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటిదే ఈ 'గ్రహాల కలయిక' (Planetary Alignment). ఏప్రిల్ 16 నుంచి 23 వరకు ఆకాశంలో బుధుడు, అంగారకుడు (Mars), శని (Saturn) నెప్ట్యూన్ గ్రహాలు ఒకే సరళరేఖలో కనిపించనున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 18 నుంచి 20 మధ్య కాలం ఈ దృశ్యాన్ని వీక్షించడానికి అత్యంత అనువైన సమయమని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సాధారణంగా గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ వేర్వేరు కక్ష్యల్లో తిరుగుతుంటాయి. కానీ భూమి నుంచి చూసినప్పుడు అవి ఒకే ప్రాంతంలో, ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. శాస్త్రవేత్తల ప్రకారం, అంతరిక్షంలో ఇవి ఒకదానికొకటి దగ్గరగా ఉండవు. సూర్యుని చుట్టూ దాదాపు సమాంతర తలంలో తిరుగుతున్నందున, మన కళ్లకు ఇవి ఒకే గీతపై ఉన్నట్లు కనిపిస్తాయి. ఇది కేవలం ఒక అద్భుతమైన దృశ్య భ్రాంతి మాత్రమే అయినప్పటికీ, ఖగోళ ప్రియులకు మాత్రం ఇది కళ్లారా చూడాల్సిన వేడుక.

Rare Planetary Alignment 2026 Watch Mars Saturn Mercury and Neptune Align in the Sky from April 16 to 23

ఎప్పుడు చూడాలి?

భారతదేశంలోని వీక్షకులు ఈ అద్భుతాన్ని చూడాలంటే తెల్లవారుజామునే నిద్రలేవాలి. సూర్యోదయానికి సుమారు 30 నిమిషాల ముందు, అంటే ఉదయం 5:00 నుంచి 5:45 గంటల మధ్య ఈ గ్రహాల అలైన్‌మెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. తూర్పు దిక్కున క్షితిజం (Horizon) వైపు ఆకాశం నిర్మలంగా ఉన్న ప్రదేశం నుంచి చూస్తే ఈ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. వీలైనంత వరకు నగర దీపాలు, ఎత్తైన భవనాలు లేని చోటుని ఎంచుకోవడం మంచిది.

60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు?
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు?

ఏ గ్రహాన్ని ఎలా గుర్తించాలి?

ఆకాశంలో ఈ నాలుగు గ్రహాలను గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు:

  • అంగారకుడు: అందరికంటే పైన, ఎరుపు-నారింజ రంగులో ధగధగ మెరుస్తూ కనిపిస్తాడు. దీన్ని నేరుగా కళ్లతోనే సులభంగా గుర్తించవచ్చు.
  • శని: అంగారకుడికి కొద్దిగా కింద పసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. ఇది కూడా కంటికి స్పష్టంగానే కనిపిస్తుంది.
  • బుధుడు: ఇది తూర్పు క్షితిజానికి చాలా దగ్గరగా, కొంచెం మసకగా ఉంటుంది. ఏప్రిల్ 20 నాటికి ఇది మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
  • నెప్ట్యూన్: ఈ గ్రహం అందరికంటే మసకగా ఉంటుంది. దీనిని ఉత్త కళ్లతో చూడటం అసాధ్యం. కాబట్టి, దీన్ని చూడాలంటే ఖచ్చితంగా బైనాక్యులర్స్ లేదా చిన్న టెలిస్కోప్ అవసరం.
ఐదు దశాబ్దాల అంతరిక్ష స్వప్నం! ఒకే భూమి.. రెండు భిన్న దృశ్యాలు!
ఐదు దశాబ్దాల అంతరిక్ష స్వప్నం! ఒకే భూమి.. రెండు భిన్న దృశ్యాలు!

మారుతున్న ఆకారం.. పెరుగుతున్న ఆసక్తి!

ఈ ఖగోళ సంఘటనలోని మరో విశేషం ఏమిటంటే, ఈ గ్రహాల సమూహం రోజురోజుకూ తన ఆకారాన్ని మార్చుకుంటుంది. మొదటి కొన్ని రోజులు త్రిభుజాకారంలో కనిపించే ఈ గ్రహాలు, ఏప్రిల్ 20 నాటికి ఒక వికర్ణ రేఖ (Diagonal line) లాగా మారిపోతాయి. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాతో పాటు ఆస్ట్రేలియాలో కూడా ఈ దృశ్యం కనువిందు చేయనుంది. మిస్ అవ్వకుండా ఈ అరుదైన ఖగోళ వింతను చూసి ఆస్వాదించండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+