Realme 15 lite 5g ఫీచర్స్ లీక్.. మిడ్ రేంజ్‌లో బెస్ట్ ఆప్షన్ !
యువతరానికి దగ్గరైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా రియల్‌మీకి ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరోసారి సత్తా చాటడానికి రియల్‌మీ సిద్దమైంది. కంపెనీ త్వరలో రియల్‌మీ 15 లైట్ 5Gను లాంచ్ చేయబోతోంది. లాంచ్ తేదీపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ.. టెక్ వర్గాల్లో ఈ ఫీచర్లు లీక్ అయినట్టు తెలుస్తోంది. ఫీచర్లను బట్టి చూస్తే.. ఈ ఫోన్ Redmi Note 14 Pro, iQOO Z9x, OnePlus Nord CE సిరీస్ వంటి మోడళ్లకు బలమైన పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా డిజైన్, కెమెరా, బ్యాటరీ పరంగా ఇది మీడియం రేంజ్ 5జీ మార్కెట్లో పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఫోన్ ధర రూ.20,000 లోపే ఉండబోతోందని.. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా అధునాతన ఫీచర్లతో వస్తుందని అంటున్నారు. లీకైన Realme 15 lite స్పెసిఫికేషన్స్ మీకోసం ప్రత్యేకంగా..

Realme 15 lite ఫీచర్స్..
డిస్‌ప్లే..
ఈ ఫోన్‌లో 6.67-అంగుళాల OLED డిస్‌ప్లే ఇవ్వబోతోంది. ఇది FHD+ రిజల్యూషన్ (1080x2400 పిక్సెల్స్), 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తున్నారు.
డిజైన్..
డిజైన్ పరంగా ఇది శాటిన్ గ్రీన్, గ్లిట్టర్ గోల్డ్, ఎలక్ట్రిక్ పర్పుల్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.
ప్రాసెసర్..
రియల్‌మీ 15 లైట్ 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్ను వినియోగిస్తున్నారు. ఈ ప్రాసెసర్ బ్యాటరీ పనితీరును మెరుగుపరచడమే కాకుండా గేమింగ్‌కు కూడా బలమైన సపోర్ట్ ఇస్తుంది.
స్టోరేజ్..
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది - 8GB + 128GB మరియు 8GB + 256GB. స్టోరేజ్ UFS 3.1 టెక్నాలజీతో వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం ఉంటుంది.
కెమెరా సెటప్..
ఫోటోగ్రఫీ కోసం, ఈ ఫోన్‌లో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 2MP మోనో లెన్స్, ఫ్లికర్ సెన్సార్ ఉంటాయి. నైట్ ఫోటోగ్రఫీ, వీడియో స్టెబిలైజేషన్ పరంగా ఈ సెట్‌అప్ బాగా పనిచేస్తుందని అంచనా. సెల్ఫీ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇవ్వబోతున్నారు.
బ్యాటరీ & ఛార్జింగ్..
ఫోన్‌కు శక్తినివ్వడానికి 5000mAh బ్యాటరీని అమర్చారు. ఇది 80W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఫోన్ 50% వరకు ఛార్జ్ అవుతుందని లీక్‌లు చెబుతున్నాయి.
సాఫ్ట్‌వేర్ & ఇతర ఫీచర్లు..
ఈ స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా Realme UI 6.0 పై నడుస్తుంది. అదనంగా, IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తోంది. అంటే నీటి చినుకులు, దుమ్ము నుండి ఫోన్ రక్షణ పొందుతుంది. ఫోన్ బరువు 185 గ్రాములు మాత్రమే ఉండటం వలన హ్యాండ్లింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ధర & వేరియంట్లు..
లీక్ ప్రకారం,
8GB + 128GB వేరియంట్ ధర రూ.17,999
8GB + 256GB వేరియంట్ ధర రూ.19,999
మార్కెట్ అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications