రూ.10,499కే Realme P3 Lite 5జీ.. బెస్ట్ ఫీచర్స్ !!

యువతరానికి దగ్గరైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా చైనీస్ సంస్థ "రియల్‌మీ" ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. లేటెస్ట్ గా భారత మార్కెట్‌లో కొత్త మోడల్ "రియల్‌మీ P3 లైట్ 5జీ" మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో కలిపి ఈ ఫోన్‌ టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది. ఈ ఫీచర్లతో రూ.12,000 లోపు 5జీ ఫోన్ వస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది.

ధర & ఆఫర్లు..

రియల్‌మీ P3 లైట్ 5జీని 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌గా రూ.12,999 ప్రారంభ ధరతో విడుదల చేశారు. ప్రస్తుతం 19% భారీ తగ్గింపుతో ఈ ఫోన్ రూ.10,499కే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5% అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్‌ను కేవలం రూ.10,000 లోపే సొంతం చేసుకోవచ్చు.

realme-p3-lite-5g-price-and-specifications

రియల్‌మీ P3 లైట్ 5జీ ఫీచర్లు..

డిజైన్ & డిస్‌ప్లే..

రియల్‌మీ P3 లైట్ 5జీ 6.67 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్నెస్‌తో వీడియోలు, గేమ్స్ చూడటం మరింత స్పష్టంగా ఉంటుంది. స్క్రీన్‌ ప్రొటెక్షన్ కోసం Panda Glass లేయర్ అందించారు.

కలర్స్..

ఈ ఫోన్ డాలీ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ అనే రెండు క్లాసిక్ రంగుల్లో అందుబాటులో ఉంది.

పర్ఫార్మెన్స్..

6ఎన్ఎమ్ ప్రాసెస్‌తో వేగం, స్థిరత్వం ఈ ఫోన్ MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్తో పనిచేస్తుంది. ఇది 6ఎన్ఎమ్ ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడింది. దీని వల్ల బ్యాటరీ వినియోగం తక్కువగా ఉండి, పనితీరు వేగంగా ఉంటుంది. ఇది తాజా Android 15 ఆధారంగా రూపొందిన Realme UI 6.0తో నడుస్తుంది. ఈ ఇంటర్‌ఫేస్ మరింత సాఫీగా, స్మార్ట్ ఫీచర్లతో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

స్టోరేజ్..

ఈ ఫోన్ 4GB/6GB ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. అదనంగా, ర్యామ్ బూస్ట్ టెక్నాలజీతో 18GB వరకు వర్చువల్ ర్యామ్ విస్తరించుకోవచ్చు. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ వల్ల యాప్స్, గేమ్స్ వేగంగా లోడ్ అవుతాయి.

కెమెరా..

రియల్‌మీ P3 లైట్ వెనుక భాగంలో 32MP గెలాక్సీకోర్ ప్రైమరీ కెమెరా (f/1.8) అపెర్చర్‌తో అందించారు. ఇది ఆటోఫోకస్, నైట్ మోడ్, HDR, 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫ్రంట్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. బ్యూటీ మోడ్, పోర్ట్రెట్ మోడ్, AI ఫీచర్లు కలగలిపి మంచి సెల్ఫీలు తీసుకునే అవకాశం ఇస్తాయి. వీడియో రికార్డింగ్ విషయంలో 1080p రిజల్యూషన్‌తో స్థిరమైన అవుట్‌పుట్ ఇస్తుంది, ఇది ఈ ధరలో అందించే అరుదైన ఫీచర్ అని చెప్పాలి.

బ్యాటరీ & ఛార్జింగ్..

ఈ ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీను అమర్చారు. దీని సహాయంతో ఒకసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు సాఫీగా ఉపయోగించవచ్చు. 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 30 నిమిషాల్లోనే 50% వరకు ఛార్జ్ అవుతుంది. చార్జర్ బాక్స్‌లోనే లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.

భద్రత & కనెక్టివిటీ ఫీచర్లు..

ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, AI ఫేస్ అన్‌లాక్, డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్, Wi-Fi 6, Bluetooth 5.3, మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. అదనంగా, స్టీరియో స్పీకర్లతో మంచి ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+