108MP కెమెరాతో REDMI Note 15 5G.. ధర, లాంఛ్ ఎప్పుడంటే..?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే బ్రాండ్‌లలో రెడ్‌మీ ముందంజలో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం షావోమీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను తీసుకొస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా తమ కొత్త స్మార్ట్‌ఫోన్ Redmi Note 15 5Gను 2026 జనవరి 6న భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే ఆగస్టులో చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్, భారత వినియోగదారుల కోసం కీలక అప్‌గ్రేడ్‌లతో వస్తుండటం విశేషం. ఈసారి మరింత అప్‌గ్రేడ్ ఫీచర్లతో ఫోన్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 108MP కెమెరా, 5520mAh బ్యాటరీ, సూపర్ స్లిమ్ బాడీ ఈ మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి. ఈ స్పెసిఫికేషన్‌లు భారత మార్కెట్ అభిరుచులకు తగ్గట్టుగా ఆప్టిమైజ్ చేశారని కంపెనీ వర్గాలు సూచిస్తున్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

రెడ్‌మీ నోట్ 15 సిరీస్..
నోట్ 15
నోట్ 15 ప్రో
నోట్ 15 ప్రో ప్లస్
మోడల్స్ ఉన్నాయి.
డిస్ ప్లే..
రెడ్‌మీ నోట్ 15లో 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
హై బ్రైట్‌నెస్ మోడ్, పంచీ కలర్స్
తక్కువ బ్లూ లైట్‌తో కళ్లకు రక్షణ లాంటివి ఉండనున్నాయి.
ఇది మీడియా వినోదం, గేమింగ్, రోజువారీ ఉపయోగాల్లో మెరుగైన అనుభవాన్ని ఇస్తుంది.
ప్రాసెసర్..
Snapdragon 6 Gen 3
నోట్ 15కు శక్తినిచ్చేది Qualcomm Snapdragon 6 Gen 3 చిప్‌సెట్.
గేమింగ్‌లో ల్యాగ్ లేకుండా మంచి పర్ఫార్మెన్స్
AI పనితీరులో అప్‌గ్రేడ్
5G నెట్‌వర్క్ సపోర్ట్
కెమెరా..
108MP ప్రైమరీ కెమెరా
సెల్ఫీ కెమెరా 16MP
4K వీడియో రికార్డింగ్
బ్యాటరీ & ఛార్జింగ్..
5520mAh బ్యాటరీ
45W ఫాస్ట్ ఛార్జింగ్
కొత్త HyperOS 2తో బ్యాటరీ లైఫ్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
సాఫ్ట్‌వేర్..
HyperOS 2 - స్మూత్ UI, తక్కువ బ్లోట్వేర్
షావోమీ కొత్తగా రూపొందించిన HyperOS 2 ఈ ఫోన్‌లో ముందుగానే ఇన్‌స్టాల్ అయి వస్తుంది.
క్లీనర్ UI
వేగవంతమైన యాప్ ఓపెనింగ్స్
మెరుగైన యానిమేషన్స్
తక్కువ బ్లోట్వేర్
ప్రైవసీ, సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లు
డిజైన్..
టీజర్ల ప్రకారం నోట్ 15 యొక్క డిజైన్ చాలా స్లిమ్‌గా ఉండబోతోంది.
7mm చుట్టుపక్కల మందం
ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్
గ్లాస్ బ్యాక్ ఫినిష్
ఇతర ముఖ్య ఫీచర్లు..
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
IR బ్లాస్టర్ (TV, AC కంట్రోల్‌కు)
స్టీరియో స్పీకర్లు
Dolby Atmos ఆడియో సపోర్ట్
అమ్మకాలు & ధరపై అంచనాలు..
Redmi Note 15 5Gను అమెజాన్, Mi.com సహా ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా విక్రయించనున్నారు. అదే సమయంలో Redmi Pad 2 Pro ట్యాబ్లెట్‌ను కూడా షియోమీ టీజ్ చేస్తుండటంతో, ఈ రెండు డివైస్‌లు ఒకే ఈవెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశముందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధర విషయానికొస్తే, ఇది ₹18,000 - ₹22,000 రేంజ్‌లో ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారిక ధర, వేరియంట్లు లాంచ్ రోజున వెల్లడించనున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications