రూ.1,09,990 "55 అంగుళాల టీవీ" కేవలం రూ.36,990కే..!

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ TCL.. తమ 55 అంగుళాల 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ QLED గూగుల్ టీవీ (మోడల్ 55T8C)పై భారీ డిస్కౌంట్ తీసుకొచ్చింది. ఈ టీవీ అసలు ధర రూ.1,09,990 కాగా ఇప్పుడు అమెజాన్‌లో 66 శాతం తగ్గింపుతో కేవలం రూ.36,990కే లభిస్తోంది. దీంతో బడ్జెట్ లోనే బెస్ట్ ఫీచర్స్ తో బ్రాండెడ్ టీవి కొనాలని అనుకునే వారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్ చెప్పొచ్చు. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.3,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ.6,165 చొప్పున 6 నెలల పాటు నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ QLED గూగుల్ టీవీ ఫీచర్స్..

డిస్ ప్లే..

ఈ మోడల్‌ 55 అంగుళాల 4K QLED ప్యానెల్ (3840×2160 రిజల్యూషన్‌)తో వస్తూ, అత్యద్భుతమైన కలర్ రిప్రొడక్షన్ మరియు కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. 4K HDR Pro, HDR10, డాల్బీ విజన్ సపోర్ట్, రంగులను, ప్రకాశాన్ని మెరుగుపరిచే TCL AiPQ ప్రాసెసర్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి సినిమా, స్పోర్ట్స్, రియాలిటీ షోలు వంటి కంటెంట్‌ను మరింత సహజంగా, స్పష్టంగా చూపిస్తాయి.

rs-1-09-990-tcl-55-inch-tv-for-just-rs-36-990

రిఫ్రెష్ రేట్..

ఈ టీవీని ప్రత్యేకంగా నిలబెట్టే మరో విషయం రిఫ్రెష్ రేట్. ఇందులో..
• 144Hz మోషన్ క్లారిటీ ప్రో
• 120Hz MEMC
• 144Hz VRR
• 240Hz DLG టెక్నాలజీ

ఈ ఫీచర్లు యాక్షన్ సీక్వెన్సులు, స్పోర్ట్స్ ఈవెంట్లు, ఫాస్ట్-పేస్డ్ గేమ్‌లలో బ్రేక్-ఫ్రీ, స్మూత్ అనుభూతిని అందిస్తాయి. ప్రత్యేకంగా VRR (Variable Refresh Rate) గేమింగ్‌లో ల్యాగ్‌ను గణనీయంగా తగ్గిస్తుంది.

డాల్బీ ఆడియో..

35 వాట్స్ శక్తివంతమైన స్పీకర్లు మరియు డాల్బీ ఆటమ్స్ సపోర్ట్‌తో ఈ టీవీ హోమ్ థియేటర్ లెవల్ సౌండ్ అనుభూతిని అందిస్తుంది. బాస్, ట్రెబుల్, సౌండ్ డెప్త్‌లో స్పష్టమైన తేడా ఉండటంతో సినిమాలు మరింత లైఫ్‌లైక్‌గా అనిపిస్తాయి.

హార్డ్‌వేర్..

ఈ TCL మోడల్ గూగుల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌పై పని చేస్తూ 3GB RAM, 32GB స్టోరేజ్, 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ వంటి స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. మల్టీటాస్కింగ్, యాప్‌లు మార్పు, గేమింగ్-all smooth. అలాగే Google Assistant, Chromecast built-in, స్క్రీన్ మిర్రరింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు రోజువారీ వినియోగంలో సులభతరం చేస్తాయి.

ప్రీ-ఇన్‌స్టాల్‌డ్ OTT యాప్‌లు..

Netflix
• Amazon Prime Video
• Disney+ Hotstar
• ZEE5
• YouTube

ఇవన్నీ వినియోగదారులకు అదనపు సెటప్ అవసరం లేకుండా సిద్ధంగా ఉంటాయి.

గేమర్స్ కోసం ప్రత్యేక ఫీచర్లు..

గేమింగ్ ప్రియుల కోసం TCL 288Hz గేమ్ యాక్సిలరేటర్, గేమ్ మాస్టర్ మోడ్‌ను అందించింది. ఇవి ఫ్రేమ్ రేట్లను పెంచి ల్యాగ్, స్టట్టర్‌ను తగ్గించి ఆడే అనుభూతిని మరింత ప్రొఫెషనల్‌గా చేస్తాయి.

అలానే ఈ TVలో
• 4× HDMI పోర్ట్స్
• 1× USB పోర్ట్
• LAN పోర్ట్
• డిజిటల్ ఆడియో అవుట్
• ఆంటెన్నా ఇన్‌పుట్

లభిస్తాయి. కేవలం టీవీ మాత్రమే కాదు, సెటప్ బాక్స్, గేమింగ్ కన్సోల్, సౌండ్‌బార్, ఫైర్ స్టిక్-అన్ని డివైస్‌లను సులభంగా కలుపుకోవచ్చు.

వారంటీ & ఆఫ్టర్ సేల్స్..

ఈ టీవీకి 2 సంవత్సరాల వారంటీ, రిమోట్‌కు 6 నెలల ప్రత్యేక వారంటీ లభిస్తుంది. వారంటీ క్లెయిమ్‌ కోసం అమెజాన్ అందించే ఈ-ఇన్‌వాయిస్ సరిపోతుంది.

మొత్తానికి ఈ ధరలో 55 అంగుళాల 4K QLED, 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, డాల్బీ ఆటమ్స్ వంటి ఫీచర్లతో ఈ మోడల్ మార్కెట్లో బెస్ట్-డీల్గా నిలుస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం టీవీ అనుభూతి కోరుకునేవారికి TCL 55T8C నిజంగా అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+