Russian News: రష్యా దెబ్బకు బిత్తరపోయిన గూగుల్.. టెక్ దిగ్గజానికే చెమటలు పట్టించిన క్రెమ్లిన్

Google News: అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్‌కి కోర్టుల్లో ఈ మధ్య వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా రష్యా కోర్టు గూగుల్‌కు కనీవినీ ఎరుగని రేంజ్‌లో షాక్ ఇచ్చింది. అమెరికాకు వంత పాడుతూ సదరు సంస్థ తీసుకున్న చర్యలపై క్రెమ్లిన్ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ జరిమానా విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది.

రష్యా కోర్టు గూగుల్ పై దాదాపు 2.5 డెసిల్లియన్ డాలర్ల ఫైన్ విధించింది. వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం దీని విలువ సుమారు 100 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (GDP) కంటే కూడా ఈ ఫైన్ చాలా అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా అనుకూల మీడియా ఖాతాలను పునరుద్ధరించడానికి తిరస్కరించినందుకు గాను అక్కడి కోర్డు ఈ చర్య తీసుకుంది. దాదాపు నాలుగేళ్లుగా కొనసాగిన చట్టపరమైన వివాదాల అనంతరం ఈ భారీ మొత్తం కట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.

Russia court mind blowing shock to Google

2020లో అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగా త్సార్గ్రాడ్ అనే రష్యా ఉల్ట్రా-నేషనలిస్ట్ ఛానెల్‌ను యూట్యూబ్ నిషేధించింది. దీంతో న్యాయపరమైన వివాదాలు చెలరేగాయి. తమ కంటెంట్‌ను బ్లాక్ చేసినందుకు రష్యాకు చెందిన 17 మీడియా అవుట్‌లెట్లు, రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే జ్వెజ్దాలు గూగుల్ పై కేసు వేశాయి. ప్రారంభంలో రోజువారీ దాదాపు 1,025 డాలర్ల జరిమానా విధించిన కోర్టు.. ప్రతి వారం రెట్టింపు అవుతుండటంతో ఆ మొత్తం కాస్తా భారీ స్థాయికి చేరుకుంది. రష్యా మరియు పశ్చిమ దేశాలకు చెందిన టెక్ దిగ్గజాల మధ్య ఇది ఉద్రిక్తతలకు దారితీసింది.

జరిమానా సేకరించగలరనే నమ్మకం లేనప్పటికీ, పశ్చిమ దేశాలకు రష్యాతో ఉన్న దూరాన్ని ఈ కేసు ప్రతిబింబిస్తుంది. 2022 నుంచి రష్యా ప్రభుత్వం బ్యాంక్ ఖాతాలను స్వాధీనం చేసుకోవడం సహా అమెరికా తీసుకున్న చర్యలను సాకుగా చూపిస్తూ, రష్యా నుంచి గూగుల్ వెనక్కు మళ్లింది. గూగుల్‌కు రష్యాలో 200 మందికి పైగా ఉద్యోగులు ఉండగా, వారిని విదేశాలకు తరలించడం లేదా తొలగించడం చేసింది. కోర్టు తీర్పుపై గూగుల్ ఇంకా ఎటువంటి కామెంట్స్ చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+