మైండ్ బ్లాంక్ చేయబోతున్న SAMSUNG.. " ట్రై-ఫోల్డ్ ఫోన్ " లాంఛ్ !

ప్రస్తుతం టెక్ మార్కెట్‌లో ఫోల్డబుల్ మొబైల్ ఫోన్ల హవా కొనసాగుతుంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈ మోడల్స్ లో కొత్త ఫోన్స్ లాంఛ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు డబుల్ ఫోల్డ్ మొబైల్స్ రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్‌ మరో సంచలనానికి తెరలేపింది. తొలి ట్రై-ఫోల్డ్ మొబైల్ ఫోన్ ని రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఈ ఫోన్‌ను శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్ (Galaxy G Fold) పేరిట రిలీజ్ చేయనుందని సమాచారం.

కాగా గతేడాది శాంసంగ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌ (SDC)లో కంపెనీ తొలిసారిగా ట్రై-ఫోల్డబుల్ ఫోన్ నమూనాను ప్రదర్శించింది. అప్పటినుంచి ఈ మోడల్ పై శాంసంగ్ కసరత్తులు కొనసాగిస్తోంది. ఈ ఏడాది జులైలో జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ G ఫోల్డ్ ఆవిష్కరించే అవకాశముంది. దీనితో పాటు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 FE కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.

samsung-first-triple-fold-phone-galaxy-g-fold-price-and-features

లాంచ్ టైమ్‌లైన్..

ఈ ఏడాది లోనే గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7లతో పాటు ఈ ట్రై ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు నవంబర్ 29, 2025న దక్షిణ కొరియాలో జరగబోయే ఓ గ్రాండ్ ఈవెంట్‌లో శాంసంగ్ మూడు హ్యాండ్‌సెట్స్ - ట్రై ఫోల్డ్ ఫోన్, XR హెడ్‌సెట్‌ (Project Moohan), AI గ్లాసెస్ - ఆవిష్కరించనుందని ఓ నివేదిక తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్స్ 2026 ప్రారంభంలో ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

హువావే మేట్ XTతో పోటీ..

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ట్రై-ఫోల్డ్ విభాగంలో ఉంది Huawei Mate XT. శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్ దానికి ప్రత్యర్థిగా నిలవనుంది. అయితే డిజైన్, డిస్‌ప్లే పరిమాణాల్లో ఇది మేట్‌ ఎక్స్‌టీ కంటే భిన్నంగా ఉంటుంది.

శాంసంగ్‌ ట్రై-ఫోల్డబుల్ ఫోన్ స్పెసిఫికేషన్లు (లీక్ వివరాలు)..

డిస్‌ప్లే..

కవర్ డిస్‌ప్లే : 6.4-6.54 అంగుళాలు

మెయిన్ ఇన్నర్ ఫోల్డబుల్ డిస్‌ప్లే : 9.9-10.2 అంగుళాలు

ఫోల్డింగ్ మెకానిజం : డ్యూయల్ ఇన్నర్-ఫోల్డింగ్ డిజైన్ (రెండు వైపులా లోపలికి మడత)

డిజైన్..

హోల్-పంచ్ కటౌట్‌తో ఆకర్షణీయమైన డిజైన్

అండర్ డిస్‌ప్లే కెమెరా టెక్నాలజీ : ఉండే అవకాశం తక్కువ

samsung-first-triple-fold-phone-galaxy-g-fold-price-and-features

బ్యాటరీ..

5,600mAh బ్యాటరీ

ఛార్జింగ్ : 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్

చార్జింగ్ వేగం : 23W-24W మధ్య లీక్ సమాచారం

ప్రత్యేక ఫీచర్..

S Pen సపోర్ట్

ధర (అంచనా)..

శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్ భారీ ధర ట్యాగ్‌తో రావచ్చని లీకులు సూచిస్తున్నాయి. హువావే మేట్ XT లాంచ్ ధర దాదాపు 2,800 డాలర్లు (₹2.38 లక్షలు)గా ఉండగా.. గెలాక్సీ G ఫోల్డ్ కూడా దానికి సమానంగా లేదా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశముంది.

అలానే ఫోన్‌తోపాటు శాంసంగ్ మరో రెండు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్‌ను కూడా తీసుకురానుంది. గెలాక్సీ G ఫోల్డ్ మొట్టమొదట స్పెషల్ ఎడిషన్ గా.. పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే అవకాశముందని సమాచారం. ఇది ప్రీమియం కేటగిరీ యూజర్లను టార్గెట్ చేస్తుందని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+