"శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా" లాంఛ్.. ఫీచర్స్, ధర ఇవే ??
సాధారణంగా ప్రతి ఏడాది జనవరిలో పరిచయం చేసే శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ ఈసారి కాస్త ఆలస్యంగా మార్కెట్లోకి రానుంది. గెలాక్సీ S26 అల్ట్రా గురించి ఇప్పటికే ఇంటర్నెట్‌లో లీక్‌లు, ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 200MP కెమెరా, భారీ బ్యాటరీ, మెరుగైన ఛార్జింగ్ స్పీడ్ వంటి అప్‌గ్రేడ్‌లు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
'Galaxy Unpacked 2026' ఈవెంట్..
పలు అంతర్జాతీయ టెక్ నివేదికల ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌ను 2026 ఫిబ్రవరి చివరి వారంలో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 25న జరగనున్న 'Galaxy Unpacked 2026' ఈవెంట్‌లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. అమ్మకాలు మార్చి ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉండగా.. గెలాక్సీ S26 అల్ట్రా మార్చి మధ్య నాటికి మార్కెట్లో అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు.

కొత్తతరం డిస్‌ప్లే టెక్నాలజీ..
గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్‌లో సరికొత్త M14 OLED డిస్‌ప్లేను ఉపయోగించనున్నారు. ఇది గత తరం M13 డిస్‌ప్లేతో పోలిస్తే 20-30 శాతం ఎక్కువ పవర్ ఎఫిషియెన్సీని అందిస్తుంది. దీంతో బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడడమే కాకుండా, బ్రైట్‌నెస్, కలర్ అక్యురసీ మరింత అద్భుతంగా ఉండనున్నాయి.
అలాగే LTPO టెక్నాలజీతో 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
శక్తివంతమైన ప్రాసెసర్ & మెమరీ..
పనితీరు విషయంలో శాంసంగ్ ఎలాంటి రాజీ పడడం లేదు. గెలాక్సీ S26 అల్ట్రాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 చిప్‌సెట్‌ను వినియోగించనున్నట్లు సమాచారం. ఇది గేమింగ్, AI ప్రాసెసింగ్, మల్టీటాస్కింగ్‌లో భారీ మెరుగుదలలను అందిస్తుంది. LPDDR5X ర్యామ్ (10.7Gbps వరకు)తో పాటు UFS 4.1 స్టోరేజ్ వాడే అవకాశం ఉంది. దీంతో యాప్ ఓపెనింగ్, ఫోటో & వీడియో ప్రాసెసింగ్ వేగంగా జరుగుతాయి.
డిజైన్‌లో సన్నదనం, ప్రీమియం లుక్..
డిజైన్ పరంగా కూడా గెలాక్సీ S26 అల్ట్రా మరింత స్లిమ్‌గా ఉండనుంది. ఫోన్ మందం సుమారు 7.9mm మాత్రమే ఉండే అవకాశం ఉంది. టైటానియం ఫ్రేమ్, ఫ్లాట్ ఎడ్జెస్‌తో ప్రీమియం ఫీల్ ఇవ్వనుందని లీక్‌లు చెబుతున్నాయి. S-Pen సపోర్ట్ యథాతథంగా కొనసాగనుంది.
200MP కెమెరాతో ఫోటోగ్రఫీ..
ఫోటోగ్రఫీ విషయంలో శాంసంగ్ మరోసారి లీడర్‌గా నిలవాలని భావిస్తోంది. గెలాక్సీ S26 అల్ట్రాలో మెరుగైన సెన్సార్‌తో కూడిన 200MP ప్రైమరీ కెమెరా ఉండనుంది. పెద్ద ఎపర్చర్‌తో తక్కువ కాంతిలోనూ క్లియర్ ఫోటోలు, వీడియోలు తీయవచ్చు. అలాగే అప్‌గ్రేడ్ అయిన టెలిఫోటో లెన్స్, మెరుగైన నైట్ మోడ్, 8K వీడియో రికార్డింగ్‌లో స్థిరత్వం పెరుగుతుందని అంచనా.
భారీ బ్యాటరీ & వేగవంతమైన ఛార్జింగ్..
చాలా ఏళ్ల తర్వాత శాంసంగ్ బ్యాటరీ విభాగంలో గణనీయమైన మార్పులు చేయనుంది. గెలాక్సీ S26 అల్ట్రాలో 5,400mAh వరకు బ్యాటరీ సామర్థ్యం ఉండొచ్చని సమాచారం. వైర్డ్ ఛార్జింగ్ స్పీడ్ 45W నుంచి 60Wకి పెరుగుతుందని చెబుతున్నారు. ల్యాబ్ టెస్టుల ప్రకారం, ఫోన్ 30 నిమిషాల్లోనే 0 నుంచి 75 శాతం వరకు ఛార్జ్ అయ్యిందని లీక్‌లు సూచిస్తున్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా మెరుగుపడే అవకాశం ఉంది.
ధరపై స్పష్టత లేదు.. కానీ పెరిగే అవకాశాలు..
భారత్‌లో గెలాక్సీ S26 అల్ట్రా ధరపై ఇప్పటికీ స్పష్టత లేదు. గత గెలాక్సీ S25 అల్ట్రా ధర ₹1,29,999గా ఉండగా, S26 అల్ట్రా ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అమెరికా మార్కెట్‌లో ధరలను స్థిరంగా ఉంచాలని శాంసంగ్ యోచిస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ కొరత, కాంపోనెంట్ ధరలు పెరగడంతో ధరలపై ప్రభావం ఉండొచ్చని కంపెనీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications