ఆస్ట్రేలియాలో వింత: సడన్ గా ఎర్రబారిన ఆకాశం (వీడియో)
ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కారమైంది. ఇక్కడి షార్క్ బే, డెన్‌హామ్ వంటి ప్రాంతాల్లో పగటిపూట ఆకాశం అకస్మాత్తుగా ఎరుపు రంగులోకి మారింది. ఎటు చూసినా ఎర్రటి ధూళి కప్పుకోవడం కనిపించింది. రోడ్లు, ఇళ్లు, సముద్ర తీరం సైతం ఎరుపు రంగులో దర్శనం ఇచ్చాయి. ఈ వింత, భయంకరమైన దృశ్యానికి కారణం ట్రాపికల్ సైక్లోన్ నరెల్. దీని కారణంగా ఆకాశం ఎర్రబారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
దీనిపై ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ న్యూస్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఎడారి ప్రాంతంలో ఇనుము అధికంగా ఉన్న ఎర్రటి మట్టిని తీవ్ర గాలులు గాలిలోకి ఎగదన్నడం వల్ల అక్కడి వాతావరణం అంతా ఎరుపుమయమైందని తెలిపింది. ఈ దుమ్ము ఆకాశంలో వ్యాపించగానే అందులో ఉండే ఐరన్ ను సూర్యరశ్మిలో ఉండే గురుత్వాకర్షణ శక్తికి గురైంది. సూర్య కిరణాలు వికీర్ణం అయ్యాయి. చెల్లాచెదురుగా మారాయి. ఆకాశం మొత్తం నెత్తుటి రంగులో కనిపించినట్లు వివరించింది.

ఈ అసాధారణ ఘటన అక్కడి వారిని నివ్వెరపరిచింది. స్థానికులు ఈ పరిస్థితిని నమ్మశక్యం కాని వింతగా అభివర్ణిస్తోన్నారు. తుఫాన్ నరెల్ రెండు రోజుల కిందటే పశ్చిమ ఆస్ట్రేలియాలోని వాయువ్య తీరాన్ని తాకింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీవ్రమైన గాలులు కారణంగా దృశ్యమానత దాదాపు జీరోగా మారింది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. దీని ప్రభావంతో రెండు రోజులుగా బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి.
వాతావరణం చాలా వింతగా, భయంకరంగా ఉందని, ప్రతిదీ ధూళితో కప్పి ఉందని షార్క్ బే కారావాన్ పార్క్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వేగంగా వైరల్ అయ్యాయి. చాలా మంది యూజర్లు దీనిని భయంకరంగా అభివర్ణించారు. తుఫాను వల్ల ఎక్స్ మౌత్ తీవ్రంగా ప్రభావితమైంది. విమానాశ్రయం భారీ నష్టాన్ని చవిచూసింది. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. షెవ్రాన్, వుడ్‌సైడ్, శాంటోస్ వంటి ప్రధాన గ్యాస్ ప్లాంట్లు కూడా ప్రభావితం కావడంతో ఇంధన ఉత్పత్తిపై ప్రభావం పడింది.
🚨🇦🇺 The sky turned blood red across Western Australia as Tropical Cyclone Narelle pushed dust through the air.
— Mario Nawfal (@MarioNawfal) March 28, 2026
Between the meteors and now this, 2026 is giving very biblical vibes and we're only in March...pic.twitter.com/Fc6jcHmbES https://t.co/OUTQHM5NBl
ఈ ప్రాంతంలోని మట్టిలో ఐరన్ ఆక్సైడ్ (తుప్పు పట్టిన ఇనుము) అధికంగా ఉంటుంది. తుఫాను గాలులు ఈ ఎర్రటి ధూళిని వాతావరణంలో ఎగదన్నాయి. నాసా తీసిన శాటిలైట్ ఫొటోల్లోనూ దీని కదలిక స్పష్టంగా కనిపించాయి. గ్లోబల్ హీటింగ్ కారణంగా తుఫానులు మరింత శక్తివంతంగా మారుతున్నాయని, అసాధారణ మార్గాలలో ప్రయాణిస్తున్నాయని నాసా చెబుతోంది. తుఫాన్ నరెల్ మూడు వేర్వేరు ప్రాంతాల గుండా ప్రయాణించడాన్ని ఇందుకు ఉదహరిస్తోంది.












Click it and Unblock the Notifications