కేవలం రూ.10,999 నుంచే.. అదిరిపోయే ఫీచర్లతో Wobble k, X-సిరీస్ టీవీలు !!

Indkal Technologies ఆధ్వర్యంలోని స్వదేశీ బ్రాండ్ Wobble భారత స్మార్ట్ టీవీ మార్కెట్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఉన్న X-సిరీస్‌కు కొత్త మోడళ్లను జోడించడమే కాకుండా, పూర్తిగా కొత్తగా బడ్జెట్-ఫ్రెండ్లీ K-సిరీస్ను లాంచ్ చేస్తూ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఆధునిక ఫీచర్లు, పోటీ ధరలతో ఈ టీవీలు భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నాయి. 2024లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన Wobble, తక్కువ సమయంలోనే గణనీయమైన గుర్తింపు సంపాదించింది.

వినియోగదారుల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు విభిన్న అవసరాలను తీర్చేలా రెండు సెగ్మెంట్లలో కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఒకవైపు సాధారణ కుటుంబాల కోసం K-సిరీస్, మరోవైపు గేమర్లు, ప్రీమియం యూజర్ల కోసం X-సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Wobble K-సిరీస్, X-సిరీస్ స్మార్ట్ టీవీలు ప్రస్తుతం Flipkart ద్వారా భారతదేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. స్పెసిఫికేషన్లు, ధరలను పరిశీలిస్తే, ఈ కొత్త టీవీలు మార్కెట్లో వినియోగదారుల ఆసక్తిని గణనీయంగా రేపుతున్నాయి.

smart-tv-brand-wobble-from-india-launches-new-k-and-x-series-with-amazing-features-on-lowest-prices

Wobble K-సిరీస్ ఫీచర్స్..

Wobble K-సిరీస్ స్మార్ట్ టీవీలు 32 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు వివిధ స్క్రీన్ సైజ్‌లలో లభిస్తున్నాయి. కేవలం ₹10,999 ప్రారంభ ధరతో వస్తుండటం ఈ సిరీస్ ప్రత్యేకత. తక్కువ ధరలోనే HDMI 2.1, డ్యువల్-బ్యాండ్ Wi-Fi వంటి ఆధునిక ఫీచర్లను అందించడం విశేషం.

ఈ సిరీస్‌లో..

  • Google TV 5.0
  • 32GB ఇంటర్నల్ స్టోరేజ్
  • ALLM & MEMC సపోర్ట్
  • 40W పవర్‌ఫుల్ సౌండ్ అవుట్‌పుట్
  • Dolby Vision & Dolby Atmos

వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. స్లిమ్ ఫ్రేమ్‌లెస్ డిజైన్‌తో రూపొందిన ఈ టీవీలు రోజువారీ వినోదం, వీడియో స్ట్రీమింగ్‌కు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి.

Wobble X-సిరీస్ ఫీచర్స్..

గేమింగ్, హై-ఎండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించిన Wobble X-సిరీస్ టీవీలు ₹23,999 (43 అంగుళాల మోడల్) ప్రారంభ ధరతో లభిస్తున్నాయి. ఇవి 50, 55 అంగుళాల వేరియంట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ సిరీస్‌లో

  • Ultra QLED డిస్‌ప్లే
  • 1.07 బిలియన్ రంగులు
  • Dolby Vision సపోర్ట్
  • MEMC & ALLM
  • 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR)

వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా గేమర్లకు అనువైన HDMI 2.1, eARC సపోర్ట్ ఈ టీవీలను ప్రత్యేకంగా నిలబెడతాయి.

80W 'PRO' ఆడియో సిస్టమ్..

డ్యుయల్ వూఫర్లు

ప్రత్యేక యాంప్లిఫైయర్

ట్వీటర్లు

Dolby Atmos సపోర్ట్

ఉండటం వల్ల హోమ్ థియేటర్ స్థాయి ఆడియో అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ధరల సెగ్మెంట్‌లో ఇంత శక్తివంతమైన ఆడియో అరుదేనని Wobble పేర్కొంది.

AI ఆధారిత పనితీరు & ప్రీమియం డిజైన్..

Wobble X-సిరీస్ టీవీలు AI ఆధారిత DynamIQ డ్యువల్ ప్రాసెసర్తో వస్తాయి. ఇది చిత్ర నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, మొత్తం సిస్టమ్ పనితీరును వేగవంతం చేస్తుంది. మెటల్ ఫినిష్, స్లిమ్ ఫ్రేమ్‌లెస్ డిజైన్ ఈ టీవీలకు ప్రీమియం లుక్‌ను ఇస్తూ ఇంటి డెకర్‌కు అదనపు ఆకర్షణను జోడిస్తుంది.

ఈ సందర్భంగా Indkal Technologies సీఈవో ఆనంద్ దూబే మాట్లాడుతూ.. "X, K సిరీస్‌ల ద్వారా అధిక పనితీరు కోరుకునే యూజర్లతో పాటు సాధారణ భారతీయ కుటుంబాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని మా స్మార్ట్ టీవీ పోర్ట్‌ఫోలియోను విస్తరించాం. ఈ మోడళ్లు తమ విభాగాల్లో బలమైన పోటీని ఇవ్వగలవు అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+