రూ.10 వేలకే .. 8GB RAM, 6,000mAh బ్యాటరీతో "శాంసంగ్" కొత్త ఫోన్
స్మార్ట్ ఫోన్ లలో టాప్ బ్రాండ్స్ అంటే సామ్‌సంగ్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. 2026 కొత్త ఏడాది సందర్భంగా లో బడ్జెట్ 5G సెగ్మెంట్‌ను శాంసంగ్ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నట్లు టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. Galaxy M17e 5G పేరుతో ఈ ఫోన్ త్వరలోనే అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఇప్పటికే చర్చలో ఉన్న Galaxy A07 5Gకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా మార్కెట్లోకి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Google Play Consoleలో లీక్..
ఇటీవల Google Play Console లిస్టింగ్‌లో Galaxy M17e 5G కనిపించడం టెక్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ మోడల్ నంబర్ SM-M076B, కోడ్‌నేమ్ **"A07x"**గా నమోదు కావడం విశేషం. తొలుత దీనిని Galaxy M07 5Gగా భావించినా, లిస్టింగ్‌లో స్పష్టంగా M17e 5G అని ఉండటంతో కొత్త మోడల్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

'e' సఫిక్స్ అంటే ఏంటి?
సాధారణంగా శాంసంగ్‌లో 'e' సఫిక్స్ అనేది అత్యంత తక్కువ ధరలో వచ్చే Galaxy A0Xe, M0Xe, F0Xe సిరీస్‌లకు మాత్రమే పరిమితం. కానీ Galaxy M1X లైనప్‌లో 'e' సఫిక్స్ రావడం అరుదైన విషయం. దీంతో శాంసంగ్ తన బ్రాండింగ్ వ్యూహంలో మార్పులు చేస్తోందా? అనే చర్చ మొదలైంది. బడ్జెట్ 5G మార్కెట్‌లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, కొత్త నేమింగ్ స్ట్రాటజీని కంపెనీ పరీక్షిస్తున్నట్లు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Galaxy M17e 5Gలో అంచనా ఫీచర్లు..
- MediaTek Dimensity 6300 చిప్‌సెట్
- 8GB RAM
- Android 16 ఆధారిత One UI 8
- 6,000mAh భారీ బ్యాటరీ
- 6.7 నుంచి 6.8 అంగుళాల పెద్ద డిస్‌ప్లే
ఈ ఫోన్ ప్రధానంగా గేమింగ్ కంటే రోజువారీ 5G వినియోగం, మల్టీటాస్కింగ్, బ్యాటరీ లైఫ్పై దృష్టి పెట్టే బడ్జెట్ యూజర్లకు అనుకూలంగా ఉండనుంది.
Galaxy A07 5Gతో ఉన్న పోలికలు..
ఆసక్తికరంగా, Galaxy A07 5G కూడా Google Play Consoleలో దాదాపు ఇదే స్పెసిఫికేషన్లతో కనిపించింది. Dimensity 6300 చిప్, 8GB RAM, 6,000mAh బ్యాటరీ, Android 16 వంటి ఫీచర్లు రెండింటిలోనూ ఒకేలా ఉండటం గమనార్హం. దీంతో Galaxy M17e 5G అనేది Galaxy A07 5Gకి రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చన్న వాదన మరింత బలపడుతోంది.
అయితే ప్రస్తుతం వరకు Galaxy F07 5G లేదా F17e 5G లాంచ్‌లపై శాంసంగ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే కెమెరా స్పెసిఫికేషన్లు, చార్జింగ్ స్పీడ్, లాంచ్ తేదీ, ధర వంటి కీలక వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇదే జరిగితే పెద్ద బ్యాటరీ, క్లిన్ సాఫ్ట్‌వేర్ అనుభవంతో యువత, స్టూడెంట్స్, రోజువారీ వినియోగదారులను ఆకట్టుకునే వ్యూహం కంపెనీదిగా కనిపిస్తోంది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications