మహా శివరాత్రి తరువాత మహాద్భుతం- కళ్లెదురుగా
Planetary Parade: అంతరిక్షం..అద్భుతాలమయం. పరిశోధించే కొద్దీ- కొత్త సంగతులు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ఏ చిన్న వార్తయినా ఆసక్తి రేపుతుంది. ఎక్కడో పాలపుంతలకు అవతల సుదూర తీరాల్లో కొత్త గ్రహాలను కనుగొనడం, కృష్ణబిలాలు, తొక్కచుక్కలు, గ్రహశకలాలు భూమికి చేరువగా ప్రయాణించడం వంటి వార్తలు ఎప్పుడూ ఆసక్తిని కలగజేసేవే.
28న సప్తగ్రహ కూటమి..
అలాంటి ఉదంతాల్లో ఒకటి- సప్తగ్రహ కూటమి. ఈ నెల 28వ తేదీన సప్తగ్రహాలు ఒకే వరుసలో రానున్నాయి. సమాంతర రేఖపై కనిపించనున్నాయి. శుక్రుడు (వీనస్), కుజుడు (మార్స్), గురు (జుపిటర్), శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఇప్పటికే కనువిందు చేస్తోన్నాయి. తాజాగా బుధ గ్రహం (మెర్క్యురి) కూడా వీటితో జతకట్టనుంది.

మహా శివరాత్రి తరువాత..
మహా శివరాత్రి ముగిసిన రెండో రోజే ఈ అద్భుతం సంభవించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సప్తగ్రహాలు కూటమి కట్టడం ఈ నెల 28వ తేదీన ఆరంభమౌతుంది. మార్చి 7-8వ తేదీ వరకు కనువిందు చేస్తుంది. దీన్ని చూడటానికి మార్చి 3వ తేదీ రాత్రి బెస్ట్ విజిబుల్ అండ్ అక్యురెట్ టైమ్‌గా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
మళ్లీ 2040లోనే..
సప్తగ్రహాలు కూటమి కట్టడం అనేది మళ్లీ 2040లోనే చోటు చేసుకుంటుంది. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ దీన్ని చూడటానికి ఇంకో 15 సంవత్సరాలు ఎదురు చూడాల్సొస్తుంది.
ప్లానెటరీ పరేడ్ విస్పష్టంగా..
సూర్యుడు అస్తమించిన 45 నిమిషాల తరువాత ప్లానెటరీ పరేడ్ విస్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి స్పేస్ టెలిస్కోప్‌లు, బైనాక్యులర్లు లేకుండా వీనస్, మార్స్, జుపిటర్, యురేనస్ ప్లానెట్లను నేరుగా చూడొచ్చు. శని, మెర్క్యురి, నెప్ట్యూన్‌ను చూడటానికి అవి అవసరమౌతాయి. భారత్‌లో ఏ మూల నుంచి చూసినా ఈ సప్తగ్రహాల సమూహాన్ని వీక్షించవచ్చని ప్లానెటరీ సొసైటీ తెలిపింది.
1. వీనస్- అత్యంత ప్రకాశవంతం కావడం వల్ల స్పష్టంగా దీన్ని చూడొచ్చు. సూర్యుడి నుంచి చూసుకుంటే రెండోది.. భూమికి అతి చేరువగా ఉండే గ్రహం ఇది. భూమి బరువు, వైశాల్యంతో పోల్చుకుంటే దాదాపు సమానంగా ఉంటుంది. భూమికి ట్విన్స్‌గా భావిస్తుంటారు. వాతావరణం మాత్రం పూర్తి భిన్నం.
2. మార్స్: ఎరుపు రంగుతో మెరుస్తూ ఉండటం వల్ల ఈ గ్రహాన్ని తేలికగానే గుర్తించవచ్చు. దక్షిణ దిశగా భూమికి సమాంతరంగా ఎత్తులో కనిపిస్తుంది.
3. జుపిటర్: వీనస్ తరువాత రెండో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఇదే. పైగా దీని పరిమాణం కూడా భారీగా ఉండటం వల్ల సాధారణ కంటితోనే చూడొచ్చు.
4. మెర్క్యురీ: ఈ నెల 28న ప్లానెటరీ పరేడ్ లైనప్‌లో చేరుతుంది.
5. శనిగ్రహం: భూమికి దూరంగా ఉండటం వల్ల ఈ గ్రహాన్ని చూడటానికి బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ అవసరమౌతుంది.
6. యురేనస్: భూమికి సుదూరంగా ఉండటం వల్ల ఈ గ్రహాన్ని చూడటానికి బైనాక్యులర్లు, టెలిస్కోప్ అవసరమౌతుంది.
7. నెప్ట్యూన్: యురేనస్‌లాగే భూమికి దూరంగా ఉన్న గ్రహం ఇది. దీనివల్ల సాధారణ కంటితో చూడలేం. బైనాక్యులర్లు, టెలిస్కోప్ అవసరం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications