TCS: 3.5 లక్షల మంది ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇప్పించిన టీసీఎస్..
దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ 3.5 లక్షల మంది ఉద్యోగులకు ఏఐ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చినట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం 1.5 లక్షల మంది సిబ్బంది ఏఐ నైపుణ్య శిక్షణ పొందారని తెలిపింది. "GenAIలో పునాది నైపుణ్యాలపై శిక్షణ పొందిన 350,000 మంది ఉద్యోగులతో టీసీఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద AI వర్క్‌ఫోర్స్ ఉన్న కంపెనీగా ఎదిగింది" అని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.ఇటీవల, టాటా గ్రూప్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) దానిని జనరేటివ్ ఏఐ భాగస్వామి హోదాతో గుర్తించిందని ప్రకటించింది.
గత సంవత్సరం ఏఐ కోసం ఓ బిజినెస్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది టీసీఎస్. "ప్రయోగ భాగస్వామిగా AWS ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించడం గొప్ప విషయమని" అని టీసీఎస్, ఏఐ.క్లౌడ్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ హెడ్ కృష్ణ మోహన్ అన్నారు. 2023లో క్లౌడ్, ఏఐ స్వీకరణ కోసం కస్టమర్ల పెరుగుతున్న అవసరాలను పరిష్కరించడానికి ఏఐ క్లౌడ్ కోసం ప్రత్యేక వ్యాపార విభాగాన్ని సృష్టించిన మొదటి సాంకేతిక సంస్థగా నిలిచింది.

కన్సల్టింగ్, అడ్వైజరీ, సొల్యూషన్ డిజైన్, ప్రోటోటైపింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ట్రైనింగ్, ఫైన్-ట్యూనింగ్, గార్డ్‌రైల్ ఏజెంట్ డిజైన్, ప్రాజెక్ట్ డెలివరీ ఏఐ శిక్షణ అందించినట్లు పేర్కొంది. విమానం ఆలస్యమైనపుడు లేదా రద్దయినపుడు.. ప్రత్యామ్నాయ మార్గాలను తమ వినియోగదార్లకు
అందించడానికి విమానయాన సంస్థలకు జెన్ ఏఐ అప్లికేషన్లనూ టీసీఎస్ అందించింది. గత సంవత్సరం సరిగా ఫ్రెషర్లను నియమించుకోని టీసీఎస్.. ఈ సంవత్సరం నియామకాలు ప్రారంభించింది.
మూడు విభాగాల్లో కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటోంది. నింజా, డిజిటల్, ప్రైమ్ కేటగిరీల్లో టీసీఎస్ నియామకాలు చేపట్టింది. ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 10 చివరి తేదీగా ఉంది. నింజా కేటగిరీలో వివిధ హోదాలకుగాను వార్షిక వేతన ప్యాకేజీ రూ.3.36 లక్షలు చెల్లించనున్నారు. డిజిటల్, ప్రైమ్ కేటగిరీల్లో జీతాలు రూ.7 లక్షల వరకు జీతాలు చెల్లిస్తారట.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications