Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.7999కే Tecno Pop 9 5G.. ఫీచర్స్ అదిరిపోయాయ్ !

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్ రిలీజ్ అవుతోంది. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు కస్టమర్లను ఆకర్షించేందుకు దిగ్గజ కంపెనీలు సైతం పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సంస్థ "టెక్నో" కొత్త ఫోన్ ని లాంఛ్ చేసింది. కేవలం రూ. 7,999 ధరకే 5G స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. 48MP సోనీ కెమెరా, 120Hz డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్స్ అందించడంతో ఈ ఫోన్ టెక్ ప్రియులను బాగా ఆకర్షిస్తోంది.

ధర & ఆఫర్లు..

ఈ ఫోన్ రూ. 7,999 ధరతో అమెజాన్ ఇండియాలో జాబితా అయింది. ప్రత్యేకత ఏమిటంటే, సెప్టెంబర్ 10 వరకు రూ. 500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. అంటే కేవలం రూ. 7,499కే ఈ ఫోన్ దొరుకుతుంది. అంతేకాకుండా, రూ. 399 వరకు క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభ్యం. ఎక్స్ఛేంజ్ ఆఫర్ విలువ మీ పాత ఫోన్ స్థితి, బ్రాండ్, కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది.

tecno-pop-9-5g-price-and-specifications-details

Tecno Pop 9 5G ఫీచర్లు..

డిస్‌ప్లే & డిజైన్..

టెక్నో పాప్ 9 5Gలో 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. గేమింగ్, సోషల్ మీడియా స్క్రోలింగ్, వీడియో స్ట్రీమింగ్ - అన్నింటికీ ఈ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది. డిజైన్ విషయానికి వస్తే, సన్నని బెజెల్స్, స్టైలిష్ బ్యాక్ ప్యానెల్‌తో యువతరాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

ప్రాసెసర్ & పనితీరు..

ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్ను ఉపయోగించారు. ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్, డైలీ యూజ్ అన్నింటికీ శక్తివంతమైన పనితీరును ఇస్తుంది. 4GB RAM (8GB వరకు వర్చువల్ RAM సపోర్ట్‌తో) మరియు 64GB/128GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. అవసరమైతే మైక్రోSD ద్వారా స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.

కెమెరా..

48-మెగాపిక్సెల్ సోనీ IMX582 మెయిన్ సెన్సార్ (డ్యూయల్ LED ఫ్లాష్‌తో)

సెకండరీ AI లెన్స్ అదనపు డిటైల్స్, డెప్త్ ఎఫెక్ట్స్ కోసం

8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా - సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం

ఫోటోలు, వీడియోలు లైటింగ్ కండిషన్స్‌లోనూ క్లారిటీగా రావడానికి AI ఆధారిత ఆప్టిమైజేషన్ ఉంది.

బ్యాటరీ & ఛార్జింగ్..

ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఎక్కువ టైమ్ చార్జ్ చేయకుండా.. ఒకే ఛార్జ్‌తో ఎక్కువసేపు వాడుకోవచ్చు.

సౌండ్ & సెక్యూరిటీ..

బయోమెట్రిక్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్ ఉంది.

ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కూడా ఉంది.

శక్తివంతమైన సౌండ్ కోసం స్టీరియో స్పీకర్స్ + డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఇచ్చారు.

సాఫ్ట్‌వేర్ & అప్‌డేట్స్..

Tecno Pop 9 5G ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14పై రన్ అవుతుంది. ఇందులో గేమ్ మోడ్, స్మార్ట్ ప్యానెల్, కస్టమైజేషన్ ఆప్షన్లు వంటి అదనపు ఫీచర్స్ ఉన్నాయి. కంపెనీ రెండు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది.

కనెక్టివిటీ & ఇతర ఫీచర్స్..

డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్

USB Type-C పోర్ట్

బ్లూటూత్ 5.2, WiFi కాలింగ్ సపోర్ట్

GPS, OTG సపోర్ట్

3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+