Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒప్పో నుంచి కొత్తగా F31 5G సిరీస్‌ లాంఛ్.. ఎంతంటే..?

మారుతున్న కాలానుగుణంగా ఫోన్ అనేది మనిషికి బాగా అలవాటు అయిన గాడ్జెట్. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఫోన్ లేకపోతే సమయం గడవదు అనే స్థాయికి వచ్చేశారు. ఇక మార్కెట్ లో రోజుకో కొత్త ఫోన్ లాంఛ్ అవుతోంది. కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో ఫోన్స్ లాంఛ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒప్పో మొబైల్స్ భారత మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్నాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా కంపెనీ F31 5G సిరీస్‌ కింద F31, F31 Pro, F31 Pro+ అనే మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ ఫోన్లు అద్భుతమైన పనితీరు, భారీ బ్యాటరీ, మన్నికైన డిజైన్, మరియు స్టైలిష్ లుక్‌లతో అందుబాటులోకి వచ్చాయి. మంచి ఫీచర్స్ తో వస్తున్న ఈ ఫోన్స్ టెక్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి.

three-smart-phones-launch-under-oppo-f31-5g-series

OPPO F31 సిరీస్ ఫీచర్లు..

డిజైన్ & మన్నిక..

F31 సిరీస్‌లోని అన్ని ఫోన్లు IP66, IP68, IP69 రేటింగ్‌లతో వస్తాయి. వీటివల్ల ఈ ఫోన్లు ధూళి, నీరు, అధిక పీడన నీటి నుంచి రక్షణ పొందుతాయి. అదనంగా, MIL-STD-810H సర్టిఫైడ్ 360-డిగ్రీ ఆర్మర్ బాడీ ఉండటం వలన ఇవి మరింత స్ట్రాంగ్‌గా, మన్నికగా ఉంటాయి.

డిస్‌ ప్లే..

Oppo F31 Pro+ - 6.8 అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే

Oppo F31 Pro & F31 - 6.57 అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే

ఈ మూడు ఫోన్లలోనూ ఫ్లాట్ AMOLED ప్యానెల్స్ ఉన్నాయి, వీటి రిఫ్రెష్ రేట్ గేమింగ్ మరియు మల్టీమీడియా అనుభవాన్ని మరింత స్మూత్‌గా చేస్తుంది.

పనితీరు & ప్రాసెసర్..

F31 Pro+ - Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్, 12GB RAM, 256GB స్టోరేజ్

F31 Pro - MediaTek Dimensity 7300 Energy చిప్‌సెట్, 12GB వరకు RAM, 256GB UFS 3.1

స్టోరేజ్..

F31 - MediaTek Dimensity 6300 (6nm) చిప్‌సెట్, 8GB వరకు RAM, 256GB స్టోరేజ్

ఫోన్‌లో సూపర్‌ కూల్ VC కూలింగ్ సిస్టమ్ (5219 mm²) ఉండటంతో, దీర్ఘకాలిక గేమింగ్‌లో కూడా హీట్ అవ్వకుండా కూల్‌గా పనిచేస్తుంది.

బ్యాటరీ & ఛార్జింగ్..

మూడు మోడళ్లలోనూ 7,000 mAh భారీ బ్యాటరీ ఉంది. అదనంగా బాక్స్‌లోనే 80W సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వబడింది. దీంతో కొద్ది సమయంలోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.

కెమెరా..

రియర్ కెమెరా: 50MP ప్రైమరీ (OIS తో) + 2MP మోనోక్రోమ్ లెన్స్

ఫ్రంట్ కెమెరా:

F31 Pro+, F31 Pro - 32MP

F31 - 16MP

Pro మోడళ్లలో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.

కలర్ ఆప్షన్లు..

F31 Pro+ - Gemstone Blue, Himalayan White, Festival Pink

F31 Pro - Desert Gold, Space Grey

F31 - Midnight Blue, Cloud Green, Bloom Red

ధరలు..

F31 Pro+ 5G

(8+256GB) - ₹32,999

(12+256GB) - ₹34,999

F31 Pro 5G

(8+128GB) - ₹26,999

(8+256GB) - ₹28,999

(12+256GB) - ₹30,999

F31 5G

(8+128GB) - ₹22,999

(8+256GB) - ₹24,999

F31 Pro+, F31 Pro - సెప్టెంబర్ 19 నుంచి Flipkart, Amazon, Oppo స్టోర్‌లలో అందుబాటులో ఉండనున్నాయి. అలానే F31 - సెప్టెంబర్ 27 నుంచి లభిస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+