F-35 Fighter Jet: భారత్ కు ట్రంప్ గిఫ్ట్.. మాయాస్త్రం ప్రత్యేకతలు ఏంటి..?

భారత్ సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాతో ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. ఏ సమయంలో ఏ దేశం దాడి చేస్తుందో నమ్మలేం. అందుకే దేశ రక్షణ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేసేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ రంగంలో జగజ్జేత అయిన అమెరికాతో ప్రధాని మోదీ కీలక ఒప్పందం చేసుకున్నారు. గగనతలంలో గేమ్ ఛేంజర్ గా భావించే అత్యాధునిక F-35 ఫైటర్ జెట్ లను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు F-35 ఫైటర్ జెట్ లు భారత్ కు అప్పగించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో అటు పాకిస్థాన్, ఇటు చైనా ఒక్కసారిగా కంగుతిన్నాయి. ఈ ఫైటర్ జెట్ భారత అమ్ములపొదిలో చేరితే అమెరికా లాగే భారత్ కూడా రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని భారత్ భావిస్తోంది.

F-35 ఫైటర్ జెట్ ప్రత్యేకతలు..

అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం F-35 ఫైటర్ జెట్. ఇటీవల బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ప్రదర్శనలో ఈ యుద్ధ విమానం చేసిన విన్యాసాలు భారతీయులను కన్నుతిప్పుకోకుండా చేసింది. ఐదో తరానికి చెందిన ఈ ఫైటర్ జెట్ ను అమెరికా చాలా తక్కువ దేశాలకు సరఫరా చేసింది.

Trump Announces America s Readiness to Deliver F-35 Fighter Jets to India

ప్రపంచంలోని అత్యాధునిక యుద్ధవిమానాల్లో F-35 ఫైటర్ జెట్ ఒకటి. ఈ ఫైటర్ జెట్ గంటకు 2,000 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకెళ్లగలదు. రాడార్ల కళ్లు గప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల సత్తా ఈ ఫైటర్ జెట్ సొంతం. ఈ యుద్ధ విమానం రన్ వే అవసరం లేకుండానే నిట్టనిలువుగా గాల్లోకి లేస్తుంది.. అలాగే కిందకు దిగుతుంది. దీని ధర ప్రస్తుతం రూ. 695 కోట్ల నుంచి రూ. 990 కోట్ల వరకు ఉంటుంది. ఈ యుద్ధ విమానాన్ని నడిపేటప్పుడు ఫైలట్ ధరించే హెల్మెట్ ధర రూ. 3.50 కోట్ల వరకు ఉంటుందట.

సైజు : 51 అడుగుల పొడవు, 14 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది.

బరువు: దాదాపు 60,000 ఎల్ బీ లు ఉంటుంది. అంటే 27వేల కిలోలకు పైగా బరువు ఉంటుంది.

స్పీడ్ : 1.6 మ్యాక్

రేంజ్: 450 నాటికల్ మైల్స్ వరకు దీన్ని ప్రయోగించవచ్చు.

ఎత్తు ప్రయాణం : ఈ ఫైటర్ జెట్ గాల్లో 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+