అగ్నిపర్వతం కింద ఏం జరుగుతోంది? భూగర్భంలో భారీ మాగ్మా రిజర్వాయర్

అమెరికాలోని మౌంట్ సెయింట్ హెలెన్స్ అగ్నిపర్వతం కింద ఏముందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక వినూత్న ప్రయోగం చేశారు. భూమి లోపల 15 కిలోమీటర్ల లోతులో దాగిన మాగ్మా నిల్వలను కనుగొనడానికి ఏకంగా 23 చోట్ల పేలుళ్లు సృష్టించి అగ్నిపర్వతాల అంతర్గత నిర్మాణాన్ని త్రీడీ రూపంలో ఆవిష్కరించారు.

అగ్నిపర్వతం లోపలి నిర్మాణాన్ని అధ్యయనం చేయాలంటే సాధారణంగా సహజ భూకంపాలు వచ్చే వరకు వేచి చూడాలి. కానీ 2014లో 'iMUSH' (ఇమేజింగ్ మాగ్మా అండర్ సెయింట్ హెలెన్స్) ప్రాజెక్టులో భాగంగా 70 మందితో కూడిన పరిశోధకుల బృందం విభిన్నంగా ఆలోచించింది. ప్రకృతి కోసం ఎదురుచూడకుండా, అగ్నిపర్వతం చుట్టుపక్కల 23 ప్రాంతాల్లో కృత్రిమంగా కంట్రోల్డ్ బ్లాస్టులు నిర్వహించారు. ఈ పేలుళ్ల ద్వారా భూమిలోకి పంపిన తరంగాల వేగాన్ని లెక్కించి, లోపలి పొరల మ్యాప్‌ను సిద్ధం చేశారు.

Unlocking Volcano Mysteries 23 Explosions Reveal Deep Magma Reservoir Beneath Mount St Helens Peak
భూగర్భంలో దాగున్న నిగూఢ జలనిధి!
భూగర్భంలో దాగున్న నిగూఢ జలనిధి!

రికార్డు స్థాయిలో 3,500 సీస్మోగ్రాఫ్‌ల మోహరింపు

ఈ ప్రయోగం స్థాయి మామూలుది కాదు. అగ్నిపర్వతం చుట్టూ దాదాపు 3,500 సీస్మోగ్రాఫ్ పరికరాలను అమర్చారు. కొన్నిటిని శిఖరానికి కేవలం 7.5 కిలోమీటర్ల దూరంలో ఉంచగా, మరికొన్నిటిని 150 కిలోమీటర్ల వరకు విస్తరించారు. ఈ డెన్స్ నెట్‌వర్క్, పేలుళ్ల ద్వారా వచ్చిన దాదాపు 80 వేల ప్రకంపనల డేటాను రికార్డ్ చేసింది. లోపల ఉన్న పగుళ్లు, లావా, కరిగిన శిలల గుండా ఈ తరంగాలు ప్రయాణించినప్పుడు వాటి వేగంలో వచ్చే మార్పులను శాస్త్రవేత్తలు నిశితంగా గమనించారు.

4 నుంచి 15 కిలోమీటర్ల లోతులో లావా రిజర్వాయర్!

ఈ తరంగాల డేటాను విశ్లేషించిన తర్వాత శాస్త్రవేత్తలకు ఒక అద్భుతమైన విషయం తెలిసింది. అగ్నిపర్వతం కింద 4 నుంచి 15 కిలోమీటర్ల లోతులో ఒక భారీ మాగ్మా రిజర్వాయర్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది భూగర్భంలో ఉన్న ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాంటి ద్రవం కాదు. ఇందులో 10 నుంచి 12 శాతం మాత్రమే కరిగిన పదార్థం ఉండగా, మిగతాది శిలలు, స్పటికాలతో కూడిన ఒక సంక్లిష్టమైన నిర్మాణం అని తేలింది. అగ్నిపర్వతం లోపల ఒకే పైపు లాంటి వ్యవస్థ కాకుండా, ఒక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు బయటపడింది.

30 ఏళ్ల మిస్టరీ.. మంచు కొండల్లో 'బంగారు నిధి'
30 ఏళ్ల మిస్టరీ.. మంచు కొండల్లో 'బంగారు నిధి'

ఈ పరిశోధన ఎందుకంత కీలకం?

మౌంట్ సెయింట్ హెలెన్స్ అగ్నిపర్వతానికి ఒక భయంకరమైన చరిత్ర ఉంది. 1980లో ఇది బద్దలైనప్పుడు పెను వినాశనం సృష్టించింది. ఇలాంటి అగ్నిపర్వతాలు ఎప్పుడు, ఎలా బద్దలవుతాయో ముందే అంచనా వేయాలంటే.. లోపల లావా ఎలా నిల్వ ఉందో, అది ఏ మార్గాల ద్వారా పైకి వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దశాబ్దాలుగా అంతుచిక్కని ఈ భూగర్భ రహస్యాలను, వేలాది పరికరాలు, కృత్రిమ పేలుళ్ల ద్వారా శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక స్పష్టమైన చిత్రంగా మన కళ్లముందు ఉంచారు. అగ్నిపర్వతాల ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో ఈ ప్రయోగం ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+