Vivo X100 Ultra: విడుదలైన వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..!
వివో ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫీచర్లతో వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం చైనాలో విడుదల చేసింది. కొత్త X100 సిరీస్ ఫోన్ 1-అంగులం ప్రధాన కెమెరా, 200-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. HP9 సెన్సార్ ను శామ్‌సంగ్‌తో కలిసి అభివృద్ధి చేశారు. ఈ ఫోన్ లో 20x వరకు జూమ్ చేసి ఫొటోలు, వీడియోలు తీయవచ్చు. కొత్త వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లో అనేక హార్డ్‌వేర్ ఫీచర్లు ఉన్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoCపై నడుస్తుంది. 5,500mAh బ్యాటరీతో
వస్తుంది.
వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ధర 12GB + 256GB RAM స్టోరేజ్ వేరియంట్ రూ. 74,500 నుంచి ప్రారంభమవుతుంది. 16GB + 512GB వేరియంట్ అయితే రూ. 84,000, 16GB + 1TB మోడల్ అయితే రూ. 92,000 గా ఉంది. ఈ ఫోన్ బై యుగువాంగ్, స్పేస్ గ్రే, టైటానియం రంగులో లభిస్తోంది. వివో చైనా వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్‌ల కోసం సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) వివో ఎక్స్100 అల్ట్రా ఆన్రయిడ్ 14-ఆధారిత FunTouch OS 14పై నడుస్తుంది. వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ Zeiss బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఇందులో 1-అంగుళాల పరిమాణం 50-మెగాపిక్సెల్ Sony LYT-900 సెన్సార్‌తో CIPA 4.5 స్థాయి గింబల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-1 యాంగిల్ కెమెరా ఉంటుంది. 2-అంగుళాల పరిమాణం సెన్సార్, 14mm ఫోకల్ పొడవు, 200-మెగాపిక్సెల్ APO సూపర్ టెలిఫోటో ISOCELL HP9 సెన్సార్ 1/1.4-అంగుళాల పిక్సెల్ పరిమాణం, f/2.67 ఎపర్చరు, 85mm ఫోకల్ పొడవు, CIPA 4.5 ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగి ఉంది. హ్యాండ్‌సెట్‌లో 4K మూవీ పోర్ట్రెయిట్ వీడియోలను షూట్ చేయడానికి బ్లూప్రింట్ ఇమేజింగ్ చిప్ V3+ చిప్ కూడా ఉంది.
సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం, వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 1TB వరకు UFS 4.0 అంతర్నిర్మిత స్టోరెజీ కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, OTG, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, సామీప్య సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్ మరియు ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications