వివో నుంచి అదిరిపోయే ఫోన్.. ఫీచర్స్ చూస్తే అస్సలు వదలిపెట్టరు !!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఇది అదిరిపోయే శుభవార్త. తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్ X సిరీస్‌లో మరో పవర్‌ఫుల్ ఫోన్ Vivo X200T ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. అద్భుతమైన కెమెరా, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్ , వినూత్నమైన AI ఫీచర్లతో రాబోతున్న ఈ ఫోన్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
కాగా వివో కంపెనీ తన X200 సిరీస్‌ను మరింత విస్తరిస్తూ, ఈ X200T మోడల్‌ను పరిచయం చేయబోతోంది. ఇది ఇప్పటికే భారత ప్రమాణాల సంస్థ వెబ్‌సైట్‌లో మోడల్ నెంబర్ V2561 తో కనిపించింది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ గురించి మీకు తెలియాల్సిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.

Vivo X200T ఫీచర్స్..
వివో కంపెనీ తన X200 సిరీస్‌ను మరింత విస్తరిస్తూ, ఈ X200T మోడల్‌ను పరిచయం చేయబోతోంది. ఇది ఇప్పటికే భారత ప్రమాణాల సంస్థ వెబ్‌సైట్‌లో మోడల్ నెంబర్ V2561 తో కనిపించింది.
1. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్..
ఈ ఫోన్‌లో మీడియాటెక్ యొక్క అత్యంత శక్తివంతమైన Dimensity 9400 Plus ప్రాసెసర్‌ను ఉపయోగించబోతున్నట్లు సమాచారం. ఇది కేవలం గేమింగ్‌కే కాకుండా, మల్టీ టాస్కింగ్‌లోనూ మెరుపు వేగంతో పనిచేస్తుంది.
2. అద్భుతమైన డిస్‌ప్లే & డిజైన్..
6.31-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్ ,5,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో విజువల్స్ అదిరిపోతాయి. ఫోటోలు , వీడియోల నాణ్యతను పెంచడానికి ప్రత్యేకమైన AI టెక్నాలజీని ఇందులో జోడించారు.
3. కెమెరా సెటప్ (ZEISS Optics)..
వివో ఫోన్ అంటేనే కెమెరాకు పెట్టింది పేరు. Vivo X200T లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండబోతోంది:
ప్రధాన కెమెరా పవర్ 50MP సోనీ IMX921 సెన్సార్,
అల్ట్రా-వైడ్: 50MP లెన్స్.
టెలిఫోటో: 50MP పెరిస్కోప్ లెన్స్ (3x ఆప్టికల్ జూమ్).
సెల్ఫీ: 50MP ఫ్రంట్ కెమెరా.
4. భారీ బ్యాటరీ & సాఫ్ట్‌వేర్..
ఈ ఫోన్ 6,200mAh నుండి 6,500mAh వరకు భారీ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇది Android 16పై రన్ అవుతుంది. వివో ఈ ఫోన్ కోసం 5 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తోంది.
5. ధర..
Vivo X200T గతంలో విడుదలైన Vivo X200 FE కి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా కనిపిస్తోంది. దాదాపు రూ. 54,999 నుండి రూ. 60,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది.ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 2026 చివరి నాటికి భారతదేశంలో అధికారికంగా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు గనుక అద్భుతమైన కెమెరా మరియు సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్ ఉన్న ప్రీమియం ఫోన్ కోసం చూస్తుంటే, Vivo X200T కోసం మరికొన్ని రోజులు వేచి చూడటం మంచిది.












Click it and Unblock the Notifications