సృష్టికి ప్రతిసృష్టి: టెక్ షేకప్- దునియా మొత్తం చైనా వైపు పరుగెత్తాల్సిందే

DeepSeek: ప్రపంచ దేశాలు దేన్నయినా అభివృద్ధి చేస్తే దాన్ని తలదన్నేలా సరికొత్త టెక్నాలజీని కనిపెడుతుంటుంది చైనా. అత్యంత చవకైన మొబైల్ హ్యాండ్ సెట్ మొదలుకుని అంతరిక్ష ప్రయోగాల వరకూ ఇతర దేశాలన్నీ ఒక వైపు ఉంటే చైనా ఒక్కటే మరో వైపు ఉండటం చూస్తూ వచ్చాం.

ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త టూల్‌ను ఆవిష్కరించింది చైనా. చాట్ జీపీీటీని తలదన్నేలా దీన్ని అభివృద్ధి చేసింది ఆ దేశానికి ఓ స్టార్టప్ కంపెనీ. దీని పేరు డీప్ సీక్ ఆర్1. ఈ కంపెనీ ఏర్పాటైంది గత ఏడాది. అంటే సంవత్సర కాలంలో చాట్ జీపీటీకి తాతలాంటి ఏఐ మోడల్‌ను డెవలప్ చేసింది.

What is Deepseek Chinese AI model that rattled Chatgpt

అత్యంత చవగ్గా దీన్ని రూపొందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచం మొత్తం దీని గురించే చర్చించుకుంటోంది. డీప్ సీక్ ప్రభావం అమెరికా మార్కెట్‌పై తీవ్రంగా పడింది. చిప్ మేకర్ ఎన్‌విడియా షేర్లు కుప్పకూలిపోయాయి. ఒక్క దెబ్బకు 600 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ వేల్యూను కోల్పోయిందా సంస్థ.

ఓపెన్ ఏఐ, గూగుల్, మెటాతో పోల్చుకుంటే దీనికి అయ్యే ఖర్చు నామమాత్రమే. డీప్ సీక్ ఆర్1 బేస్ మోడల్ కోసం కంప్యూటింగ్ పవర్‌పై 5.6 మిలియన్ డాలర్లను మాత్రమే ఖర్చు చేసినట్లు ఆ స్టార్టప్ వెల్లడించింది. అదే ఏఐ అభివృద్ధి కోసం ఈ ఏడాది 65 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో చేయనున్నట్లు మెటా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

అలాగే- డీప్ సిక్ వీ3 మోడల్‌ను అభివృద్ది చేయడానికి ఆ స్టార్టప్ కంపెనీ ఆరు మిలియన్ డాలర్లను వ్యయం చేసింది- అది కూడా ఎన్‌విడియా తయారు చేసిన హెచ్800 చిప్‌ను ఉపయోగించి. తయారీ వ్యయం, స్పీడ్, ఏఐ టెక్నాలజీలో చాట్ జీపీటీని డీప్ సిక్ వీ3 అధిగమించినట్టయింది.

అదే సమయంలో- అమెరికాలో యాపిల్ ఫోన్లను వినియోగించే వాళ్లు ఈ డీప్ సిక్ వీ3 యాప్‌ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే వెసలుబాటును ఉండటం చర్చనీయాంశమైంది. అదే ఎన్‌విడియా మార్కెట్‌ను దెబ్బకొట్టింది. ఒక్కరోజే దాదాపుగా 17 శాతం అంటే 600 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ వేల్యూను కోల్పోయింది.

డీప్‌సీక్ ఏఐ ప్లాట్‌ఫారమ్.. మల్టీ సెగ్మెంట్లల్లో ఉపయోగించవచ్చని ఆ కంపెనీ తెలిపింది. ప్రత్యేకించి- లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డేటా అనలైజేషన్, వివిధ మెషీన్ లెర్నింగ్ అప్లికేషన్ల కోసం దీన్ని వినియోగించకోవచ్చు. డీప్ సీక్ వీ3, డీప్ సీక్ ఆర్1 వంద శాతం అక్యురెన్సీతో రూపొందించినట్లు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+