వాట్సాప్ వెబ్ స్క్రోలింగ్ అవ్వట్లేదా.. ఏం చేయాలంటే ?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే వాట్సాప్ మెసేజింగ్ యాప్ మొరాయించింది. ఈరోజు ( సెప్టెంబర్ 9, 2025 ) ఉదయం నుంచి సాంకేతిక సమస్యలతో యూజర్లకు ఇబ్బంది తలెత్తుతుంది. ముఖ్యంగా వాట్సాప్ వెబ్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సందేశాలు పంపలేకపోవడం, పేజీలు స్క్రోల్ కాకపోవడం, చాట్స్ ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.
ప్రస్తుతం వాట్సాప్ వ్యక్తిగత మెసేజింగ్ మాత్రమే కాకుండా బిజినెస్ కమ్యూనికేషన్ కోసం కూడా విస్తృతంగా వాడుతున్నారు. వాట్సాప్ వెబ్ పనిచేయకపోవడంతో అనేకమంది ఆఫీసు వర్క్, కస్టమర్ సపోర్ట్, ఆన్‌లైన్ ఆర్డర్స్ వంటి పనుల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

సోషల్ మీడియాలో ట్రెండ్..
అయితే చాలామంది మొదట తమ ల్యాప్‌టాప్, మౌస్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్‌లో సమస్య ఉందని భావించారు. కానీ సమస్య వారి పరికరాల్లో కాదని.. వాట్సాప్ వెబ్ సేవలు పూర్తిగా డౌన్ కావడమే కారణమని తేలింది. గత గంటలో వేలాది మంది యూజర్లు ట్విట్టర్ (X)లో "#WhatsAppDown" హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
భారతదేశంతో పాటు అమెరికా, యూరప్, సహా పలు దేశాల నుంచి కూడా ఇదే తరహా సమస్యలు రిపోర్ట్ అవుతున్నట్టు సమాచారం. కొందరు యూజర్లు "వాట్సాప్ వెబ్‌లో మెసేజ్ టైప్ చేయగలుగుతున్నాను కానీ సెంట్ అవ్వడం లేదు" అని.. ఇంకొందరు "చాట్స్ ఓపెన్ చేయలేకపోతున్నాం, పేజీ స్టక్ అవుతోంది" కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటివరకు వాట్సాప్ సంస్థ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సాధారణంగా ఇలాంటి సాంకేతిక సమస్యలు కొన్ని గంటల్లో పరిష్కారమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అప్పటివరకు వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారానే సేవలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
సమస్యలకు ప్రధాన కారణాలు ఏమిటి?
సర్వర్ డౌన్‌టైమ్: ఫేస్‌బుక్, వాట్సాప్ సర్వర్‌లలో సాంకేతిక లోపం తలెత్తినప్పుడు యాప్ లేదా వెబ్ వెర్షన్ పని చేయదు.
డొమైన్ నేమ్ సిస్టమ్ (DNS) వైఫల్యం: DNS లోపం ఏర్పడితే వినియోగదారులు వెబ్‌సైట్‌లు, యాప్‌లకు కనెక్ట్ అవ్వలేరు.
బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (BGP) సమస్యలు: రౌటర్ కాన్ఫిగరేషన్ లోపాలు లేదా BGP అప్‌డేట్స్ సరిగ్గా పనిచేయకపోతే గ్లోబల్ కనెక్టివిటీపై ప్రభావం చూపుతాయి.
డిస్ట్రిబ్యూటెడ్ డెనైయల్ ఆఫ్ సర్వీస్ (DDoS) దాడులు: హ్యాకర్లు ఒకేసారి లక్షల సంఖ్యలో రిక్వెస్టులు పంపి సర్వర్లను డౌన్ చేయడం వల్ల సేవలు తాత్కాలికంగా నిలిచిపోవచ్చు.
వాట్సాప్ సర్వీస్ డౌన్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలు టెక్నికల్ సమస్యల కారణంగా యూజర్లు ఇబ్బంది పడ్డారు.
-
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
ఈ ఫోటోలో ఉన్న గుడ్లగూబను కనిపెట్టగలరా..? -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
ల్యాప్‌టాప్ అవసరం లేకుండానే మొబైల్లోనే ఆఫీస్ వర్క్..! -
ఫోటోలు డిలీట్ చేశారా.. మళ్లీ కావాలా ?? -
ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్పగలరా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications