రేపటి నుంచి ఈ ఫోన్ లలో వాట్సాప్ బంద్..

సోషల్ మీడియా దిగ్గడం మెటా వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ (Whats App) జూన్ 1, 2025 నుంచి కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఫోన్ మోడళ్లలో పనిచేయదని ప్రకటించింది. వాస్తవానికి మేలోనే వాట్సాప్ సేవలు కొన్ని ఫోన్లలో నిలిచిపోవాల్సి ఉన్నా.. వినియోగదారులకు డేటా బ్యాకప్ కోసం తగినంత సమయం ఇచ్చేందుకు ఈ నెల రోజులు సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది. వినియోగదారుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెటా ప్రకటించింది.

వాట్సాప్ పనిచేయని ఫోన్‌లు, ఓఎస్‌లు..

iOS 15 లేదా అంతకన్నా పాత వర్షన్లు

Android 5.0 లేదా అంతకన్నా పాత వర్షన్లు

వాట్సాప్ పనిచేయని ముఖ్యమైన పాత మోడళ్లు..

whatsapp-will-be-blocked-on-these-phones-from-tomorrow

ఐఫోన్లు..

iPhone 5s

iPhone 6

iPhone 6 Plus

iPhone 6s

iPhone 6s Plus

iPhone SE (1st Gen)

ఆండ్రాయిడ్ ఫోన్లు..

Samsung Galaxy S4

Samsung Galaxy Note 3

Sony Xperia Z1

LG G2

Huawei Ascend P6

Moto G (1st Gen)

Moto E (2014)

Motorola RAZR HD

పాత ఫోన్‌లు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందుకోవడం లేదని.. సెక్యూరిటీ ప్యాచులు లేకపోవడం వల్ల సైబర్ దాడుల ముప్పు పెరుగుతోందని మెటా స్పష్టం చేసింది. అందువల్ల వ్యక్తిగత సమాచారం గోప్యతకు భంగం కలిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణుల హెచ్చరిక ఉండడం తోనే మెటా అనౌన్స్ మెంట్ ఇచ్చింది. అయితే వాట్సాప్ పనిచేయడం ఆగిపోనుందని ఫోన్ పారేయాల్సిన అవసరం లేదని.. సిస్టమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫోన్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఉందా లేదా అని చెక్ చేసుకోమని సూచిస్తున్నారు.

లేకుంటే ఫోన్ ను మార్చాలని అనుకుంటే ముందుగానే చాట్ హిస్టరీని సేవ్ చేసుకోండి. ఎలా సేవ్ చేయాలంటే.. వాట్సాప్ సెట్టింగ్స్ > చాట్స్ > చాట్ బ్యాకప్ సెలెక్ట్ చేయండి. అక్కడ Google Account (ఆండ్రాయిడ్) లేదా iCloud (ఐఫోన్) లో బ్యాకప్ చేసుకోండి. ఇక కొత్త ఫోన్‌లో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసి, బ్యాకప్‌ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మళ్లీ వాట్సాప్ సేవలు కొనసాగించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+