Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wireless Electricity : ఇక కరెంట్ వైర్లు కనిపించవు. మన ఇళ్లకు వైర్ లెస్ పవర్

ఒకసారి ఊహించండి... ఛార్జర్ వైరు లేకుండానే మీ ఫోన్ ఛార్జ్ అయితే ఎలా ఉంటుంది.? విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల గజిబిజి లేకుండా కరెంట్ గాలి ద్వారా మీ ఇంటికి చేరితే ఎలా ఉంటుంది? ఇది సైన్స్ ఫిక్షన్ కాదు... శాస్త్రవేత్తలు మనం కోసం తయారు చేస్తున్న భవిష్యత్తు. విద్యుత్ గాలిలో ప్రయాణించగలిగితే ప్రపంచం ఎలా మారుతుంది? అంతరిక్షంలో సూర్యశక్తిని భూమికి పంపగలిగితే మన విద్యుత్ అవసరాలు తీరిపోతాయా? ఈ విషయాలన్నీ మీ కోసం.

విద్యుత్‌ను వైర్లు లేకుండా మన ఇళ్లకు సరఫరా చేయాలన్న ఆలోచన కొత్తది కాదు. చాలా కాలంగా శాస్త్రవేత్తలు దీనిపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న వైర్‌లెస్‌ మొబైల్‌ ఛార్జర్లు కూడా ఇదే ఆలోచన నుంచి వచ్చినవే. ఇక ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అన్ని పరికరాలను వినియోగించేలా చేయాలని లక్ష్యం. ఆ దిశగా కీలక అడుగులు కూడా పడ్డాయి. విదేశాల్లో చూసుకుంటే ఎక్కడా మనకు విద్యుత్ వైర్లు కనిపించవు. వారు భూమి లో నుంచి విద్యుత్ సరఫరా చేస్తుంటారు. కానీ మన దేశంలో విద్యుత్ వైర్లు ఎటు చూసిన కుప్పలు కప్పులు గా కనిపిస్తాయి. కాబట్టి అలా విద్యుత్ వైర్లు లేకుండా ఉండే మీ ప్రాంతాన్ని గుర్తు చేసుకోండి.

వైర్లు లేకుండా విద్యుత్ సరఫరా సాధ్యమైనా..?

వైర్ లెస్ విద్యుత్ సాధ్యమే.. దీనికి ప్రధానంగా ఇండక్టివ్‌ కప్లింగ్‌ అనే విధానాన్ని ఉపయోగిస్తారు. ఛార్జింగ్‌ ప్యాడ్‌లో ఒక కాయిల్‌ ఉంటుంది. ఫోన్‌లో మరో కాయిల్‌ ఉంటుంది. ఛార్జింగ్‌ ప్యాడ్‌కు కరెంట్‌ ఇచ్చినప్పుడు అక్కడ ఒక విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అదే గాలిలోంచి ఫోన్‌లోని కాయిల్‌కు చేరి, మళ్లీ విద్యుత్‌గా మారుతుంది. దీంతో ఫోన్‌ బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. అయితే ఇది చాలా దగ్గర దూరంలోనే పనిచేస్తుంది. దీనికంటే కాస్త బెటర్ విధానాన్ని రెజోనెంట్‌ ఇండక్టివ్‌ కప్లింగ్‌ అంటారు. ఇందులో ట్రాన్స్‌మిటర్‌, రిసీవర్‌ కాయిల్స్‌ రెండింటినీ ఒకే ఫ్రీక్వెన్సీకి ట్యూన్‌ చేస్తారు. అలా చేస్తే విద్యుత్‌ బదిలీ మరింత సమర్థంగా జరుగుతుంది. కొంచెం ఎక్కువ దూరం వరకు కూడా పవర్‌ను పంపే అవకాశం ఉంటుంది.

Wireless Electricity How Power Can Travel Through Air and Change the Future of Energy

ఎక్కువ దూరాలకు సరఫరా ఎలా?

చాలా దూరాలకు విద్యుత్‌ను నేరుగా పంపడం కష్టం. అందుకే శాస్త్రవేత్తలు కరెంటును ముందుగా మైక్రోవేవ్స్‌ లేదా లేజర్‌ తరంగాలుగా మార్చుతారు. ఆ తరంగాలను గాలి ద్వారా పంపిస్తారు. అక్కడ ఉన్న ఒక రిసీవర్‌ వాటిని తిరిగి విద్యుత్‌గా మార్చుతుంది. ఈ విధానాన్ని మైక్రోవేవ్‌ పవర్‌ బీమింగ్‌ అంటారు.

ఇది కొత్త ఆలోచనా? కాదు... టెస్లా కల!

ఈ ఆలోచనకు వందేళ్ల చరిత్ర ఉంది. 1890లలోనే ప్రసిద్ధ శాస్త్రవేత్త నికోలస్‌ టెస్లా గాలిలోంచే విద్యుత్‌ను ప్రపంచమంతా పంపించాలని కలగన్నాడు. భూమి, ఆకాశంలోని అయనోస్ఫియర్‌ను ఒక పెద్ద విద్యుత్‌ సర్క్యూట్‌లా ఉపయోగించాలనుకున్నాడు. అప్పట్లో టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో అది సాధ్యపడలేదు. కానీ ఆ ఆలోచనలే తర్వాత వైఫై, రేడియో, సెల్‌ఫోన్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి ఆధునిక సాంకేతికతలకు బీజం వేశాయి.

విజయవంతమైన ప్రయోగాలు..

1964లో అమెరికా శాస్త్రవేత్త విలియం బ్రౌన్‌ బృందం మైక్రోవేవ్‌ల సహాయంతో ఒక చిన్న హెలికాప్టర్‌ను గాలిలో ఎగరేసింది. ఇది వైర్‌లెస్‌ పవర్‌పై ప్రపంచంలోనే తొలి పెద్ద ప్రయోగం. తర్వాత 2017లో డిస్నీ పరిశోధకులు క్వాసీస్టాటిక్‌ కావిటీ రెజోనెన్స్‌ (QSCR) అనే పద్ధతితో గాలిలోంచే విద్యుత్‌ను పంపడంలో విజయం సాధించారు.

అంతరిక్షం నుంచే భూమికి విద్యుత్‌?

భవిష్యత్తులో గాలిలో విద్యుత్‌ బట్వాడా సులభమైతే, అంతరిక్ష ఆధారిత సౌర విద్యుత్‌ కూడా వాస్తవం అవుతుంది. భూమిపై సౌరశక్తి పగటి సమయానికే పరిమితం. మేఘాలు ఉన్నప్పుడు సరిగా అందదు. కానీ అంతరిక్షంలో మాత్రం 24 గంటలూ సూర్యకాంతి ఉంటుంది. అక్కడ సౌరశక్తి తీవ్రత భూమిపై కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ.

భూమికి చేరే సౌరశక్తిలో చాలా భాగం వాతావరణంలోనే నష్టపోతుంది. కానీ అంతరిక్షంలో ఈ నష్టం ఉండదు. అక్కడ సౌరఫలకాలతో సేకరించిన శక్తిని మైక్రోవేవ్స్‌ లేదా లేజర్‌ కిరణాలుగా మార్చి భూమికి పంపవచ్చు. భూమిపై ఉన్న యాంటెన్నాల ద్వారా మళ్లీ దాన్ని విద్యుత్‌గా మార్చుకోవచ్చు.

ఎంత ఉపయోగం?

అంతరిక్షంలో ఒక సౌర విద్యుత్‌ కేంద్రం నుంచి గిగావాట్‌ స్థాయి విద్యుత్‌ను భూమికి పంపగలిగితే, అది సంవత్సరం పాటు దాదాపు 10 లక్షల ఇళ్లకు సరిపడే విద్యుత్‌ను అందించగలదు. ఇది భవిష్యత్తులో శుభ్రమైన శక్తి విప్లవానికి దారితీయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నా

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+