ఈ రాత్రికే అంబరాన అద్భుతం: ఇప్పుడు తప్పితే మళ్లీ ఏడాది చివరికే ఛాన్స్
ఈ సంవత్సరం మొట్ట మొదటి సూపర్ మూన్ నేడు కనువిందు చేయబోతోంది. భారత్, అమెరికా సహా వివిధ దేశాల్లో అత్యంత ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్ముతూ మెరిసిపోనుంది చందమామ. సాధారణం కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా, భూమికి మరింత చేరువగా కనిపిస్తుంది. ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష వీక్షకులు ఏర్పాట్లు చేసుకుంటోన్నారు. ఈ సూపర్ మూన్.. స్కే గేజర్లకు ఈ కొత్త ఏడాది ఓ అద్భుత ఆరంభాన్ని ఇచ్చినట్టయింది.
చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి రావడాన్ని పెరిజీ (perigee) అంటారు. అదే సమయంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించినప్పుడు దానిని సూపర్ మూన్ గా పిలుస్తారు. పెరిజీ సమయంలో సూపర్ మూన్.. భూమికి 3,62,641 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది సాధారణ పౌర్ణమి చంద్రుడి కంటే 30 శాతం ప్రకాశవంతంగా, 14 శాతం పెద్దదిగా దర్శనం ఇవ్వడానికి కారణం. ఈ ఏడాది కనిపించే మూడు సూపర్ మూన్‌లలో ఇది మొదటిది. దీని తర్వాత మళ్లీ ఇటువంటి అద్భుతం కోసం ఏడాది చివరి వరకు వేచి ఉండాలి.

జనవరిలో సంభవించే పౌర్ణమిని వూల్ఫ్ మూన్ అని పిలుస్తారు. దీని మూలాలు ఉత్తరార్ధగోళ జానపద కథలలో ఉన్నాయి. చలికాలంలో గ్రామాల వెలుపల తోడేళ్ళు అరుస్తూ కనిపించేవని, అందుకే ఈ పేరు వచ్చిందని 'ది ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్' పేర్కొంది. దీన్ని "మూన్ ఆఫ్టర్ యూల్" అని కూడా వ్యవహరిస్తారు. చంద్రుడు క్షితిజానికి దగ్గరగా ఉన్నప్పుడు అది నారింజ-పసుపు రంగులో మెరుస్తూ, అసాధారణంగా పెద్దదిగా కనిపిస్తుంది. ఇది మూన్ ఇల్యూషన్. దీనిద్వారానే చంద్రుడు చాలా దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఈ వూల్ఫ్ సూపర్ మూన్‌ను భారత్ లో సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం 5:45 నుండి 6:00 గంటల మధ్య తూర్పు ఆకాశంలో చూడొచ్చు. అమెరికాలో 2 నుండి 4 వరకు సూర్యాస్తమయం తర్వాత ఉదయపు వేళల్లో ఇది కనిపిస్తుంది. ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం.. దీని గరిష్ట సమయం 3వ తేదీ తెల్లవారు జామున 5:30 లేదా ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం సాయంత్రం 4 గంటలు. స్పష్టమైన ఆకాశం, ఎటువంటి అడ్డంకులు లేని తూర్పు క్షితిజం.. సూపర్ మూన్ ను తిలకించడానికి అత్యుత్తమం.
వూల్ఫ్ సూపర్ మూన్ శీతాకాలంలో అతి భారీ ఉల్కాపాతాల్లో ఒకటైన క్వాడ్రాంటైడ్ మెరియోరియర్ షావర్ తో కలిసి ఏకకాలంలో సంభవిస్తుంది. సాధారణంగా చీకటి కమ్ముకున్న ఆకాశంలో గంటకు 25 ఉల్కలను చూడొచ్చు. చంద్రకాంతి అత్యంత ప్రకాశంగా ఉండటం వల్ల ఈ ఉల్కాపాతం గంటకు 10 కంటే తక్కువగానే కనిపించే అవకాశం ఉంది. క్వాడ్రాంటైడ్ ఉల్కాపాతం ఈ నెల రెండో వారం వరకూ కనిపిస్తుంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications