చిమ్మ చీకట్లో వింత వెలుగులు: భూమి వైపు దూసుకొచ్చిన ఆ ఆబ్జెక్ట్

జపాన్ లో భారీ ఉల్కాపాతం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో ఉల్కలు భూమి వైపు దూసుకొచ్చాయి. మెరుపులు మెరిపించాయి. కొంత సమయం పాటు ఆకాశం మొత్తం వివిధ రంగులతో మెరిసిపోయింది. అవి నేలపడే ప్రమాదం ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు గానీ.. అలాంటిదేదీ చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. చాలావరకు ఉల్కలు సముద్రంలో పడ్డాయి.

మీటెయోరాయిడ్స్ భూమి లేదా ఇతర గ్రహాల వాతావరణంలోకి అధిక వేగంతో ప్రవేశించినప్పుడు భగ్గున మండిపోతాయి. దానివల్లే అవి వింత రంగులను వెదజల్లుతాయి. ఉల్కల్లో ఉండే రసాయనాలు, భూవాతావరణ పరిస్థితులను బట్టి అవి వేర్వేరు రంగుల్లో మెరిసిపోతుంటాయి.

Witness the Spectacle Japan s Sky Lights Up with Stunning Fireball Meteor

జపాన్ కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున ఉదయం 5:03 నిమిషాలకు ఉల్కాపాతం సంభవించింది. వీటి పరిమాణం అసాధారణంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి ప్రేరేపించినట్టయింది. ఈ భారీ ఉల్కలను ఫైర్ బాల్స్ లేదా షూటింగ్ స్టార్స్‌ గా పిలుస్తారు.

జపాన్‌లోని క్యుషు, షికోకు ప్రాంతం గగనతలంపైకి దూసుకొచ్చిన ఓ భారీ ఉల్కను స్థానికులు తమ సెల్ ఫోన్లల్లో చిత్రీకరించారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆకాశంలోకి దూసుకువచ్చిన ఆ ఫైర్ బాల్.. నీలం, లేత ఆకుపచ్చ రంగుల్లో మెరిసిపోయింది.

ఫుకొయోకా, కగోషిమా, మాట్సుయామా ఎయిర్ పోర్టుల్లోఅమర్చిన కెమెరాల్లో ఈ దృశ్యం రికార్డ్ అయింది. ఈ మండుతున్న మీటెయోర్.. కొన్ని సెకన్లపాటు ఆకాశంలో వెలిగి ఆ తర్వాత అదృశ్యమైంది. ఫుకొయోకాతో పాటు అవి రికార్డ్ అయ్యాయి. ఇటీవలే జపాన్‌ ఈశాన్య ప్రాంతంలోని అయోమోరి ప్రిఫెక్చర్‌లో ఓ మీటెయోరాయిడ్ క్లస్టర్ కనిపించింది.

పెర్సీడ్ మీటెయోర్ షవర్.. గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఈ అరుదైన దృశ్యం రికార్డయింది. పెర్సీడ్స్ ఉల్కాపాతంలో భాగంగా ఆ ఘటన చోటు చేసుకుంది అప్పట్లో. పెర్సీడ్స్ అత్యంత వేగవంతమైనవి. దీని వేగం అనూహ్యంగా ఉంటుంది. వాటి నుంచి వెలువడే కాంతి కూడా అదే స్థాయిలో ఉంటుంది. కళ్లు మిరమిట్లు గొల్పుతాయి. స్విఫ్ట్-టటిల్ తోకచుక్క నుండి వెలువడే శిధిలాలు భూ వాతావరణంలో మండినప్పుడు ఇవి ఏర్పడతాయి.

నాసా తెలిపిన వివరాల ప్రకారం- ప్రతిరోజూ సుమారు 44 టన్నుల మీటెయోరిటిక్ పదార్థాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే.. వాటిల్లో 80 శాతం వరకు ఆవిరైపోతుంటాయి. కొన్ని మాత్రమే భూమి/సముద్రాలను తాకుతుంటాయి.

గతంలో దాదాపుగా అరటన్ను బరువు ఉన్న ఓ ఉల్క.. అమెరికాలో భూమిని తాకింది. దీని దెబ్బకు భారీ గొయ్యి ఏర్పడింది. భారీ శబ్దం చేస్తూ ఉల్క నేలను తాకిన అనంతరం దుమ్ము, ధూళి సమీప ప్రాంతాలను కమ్ముకున్నాయి. స్వల్పంగా భూమి కంపించిందంటూ వార్తలు వెలువడ్డాయి. సోనిక్ బూమ్ ఏర్పడింది.

టెక్సాస్ దక్షిణ ప్రాంతంలోని మెక్అలెన్ ప్రాంతంలో ఈ భారీ ఉల్క భూమిని తాకింది. అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ విషయాన్ని ధృవీకరించింది. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఉల్కాపాతం సంభవించినట్లు డల్లాస్ లోని ఫాక్స్ స్టేషన్ కేడీఎఫ్‌డబ్ల్యూ వెల్లడించింది.

ఈ ఉల్క బరువు సుమారు అర టన్ను ఉంటుందని అంచనా వేసింది. వెయ్యి పౌండ్ల బరువు, రెండు అడుగుల వెడల్పు ఉందని తెలిపింది. ఉల్కా నేలను తాకిన ప్రదేశాన్ని గుర్తిస్తూ ఓ మ్యాప్ ను నాసా విడుదల చేసింది. మెక్‌అలెన్ కు పశ్చిమ దిక్కున భూమి వైపునకు ఈ ఉల్క దూసుకొచ్చిన దృశ్యాన్ని జియోస్టేషనరీ లైట్నింగ్ మ్యాపర్ రికార్డు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+